Homeప్రవాస భారతీయులుEngland: లండన్‌ ఆస్పత్రిలో కీచకపర్వం.. భారత సంతతి డాక్టర్‌పై లైంగిక అభియోగాలు

England: లండన్‌ ఆస్పత్రిలో కీచకపర్వం.. భారత సంతతి డాక్టర్‌పై లైంగిక అభియోగాలు

England: ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌ బ్లాక్‌పూల్‌ విక్టోరియా ఆస్పత్రిలో జర్జన్‌గా పనిచేస్తున్న భారత సంతతి వైద్యుడు 54 ఏళ్ల అమల్‌ బోస్‌పై లైంగిక దాడి అభియోగాలు నమోదయ్యాయి. గతేడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆస్పత్రి బోస్‌ను సస్పెండ్‌ చేసింది. క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌(CPS)తో విచారణ తర్వాత ఆరుగురు బాధిత మహిళలు బోస్‌పై 14 లైంగిక అభియోగాలు మోపారు.

2017 నుంచి 2022 వరకు..
బోస్‌ బ్లాక్‌పూల్‌ విక్టోరియా ఆస్పత్రిలో కార్డియోవాస్కులర్‌ సర్జరీ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. 2017 నుంచి 2022 మధ్య ఆస్పత్రి సిబ్బందితోపాటు, రోగులు, వారి బంధువులపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు విచారణ కొనసాగుతోంది. జూన్‌ 7న లాంకాస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. బోస్‌పై ఆరోపణలను బ్లాక్‌పూల్‌ టీచింగ్‌ హాస్పిటల్స్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ధ్రువీకరించింది. పోలీసుల విచారణకు సహకరిస్తామని హామీ ఇచ్చింది. సేవలు యథావిధిగా కొనసాగిస్తూ, రోగులు, కుటుంబాలకు సురక్షితమైన, సంరక్షణ వాతావరణాన్ని నిర్వహించడంలో తమ నిబద్ధతను వారు నొక్కిచెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో..
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే తరహా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లిండ్‌లో తన వద్ద చికిత్స తీసుకుంటున్న మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భారత సంతతి వైద్యుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌లోని హవంత్‌ స్టాంటన్‌ సర్జరీ లో మాజీ జనరల్‌ ప్రాక్టీషనర్‌ మోహన్‌బాబు పోర్ట్స్‌ మౌత్‌ క్రౌన్‌ కోర్టులో మూడు వారాలపాటు జరిగిన విచారణకు హాజరయ్యాడు. లైంగిక వేదింపుల 2019 సెప్టెంబర్‌ నుంచి 2021 జూలై మధ్య జరిగాయని తెలిపాడు. బాధితుల్లో 19 ఏళ్ల యువతి కూడా ఉన్నట్లు కోర్టు పేర్కొంది. అదే క్లినిక్‌లో జనరల్‌ ప్రాక్టీషనర్‌ అయిన తన భార్యతోపాటు మోహన్‌బాబు పనిచేసిన స్టాంటన్‌ సర్జరీ ప్రాంగణంలో ముగ్గురు మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. మోహన్‌బాబుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, బాధతులను అనుచితంగా తాకడం, గగుర్పాటు కలిగించే వ్యాఖ్యలు చేయడం వంటివాటిపైన ఆయనను పలుమార్లు హెచ్చరించినట్లు న్యాయ నిపుణులు పేర్కొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version