https://oktelugu.com/

Darling Movie: డార్లింగ్ సినిమాలో ప్రభాస్ నే అల్లాడించిన చిచ్చర పిడుగు… ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

Darling Movie: 2010లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వచ్చిన డార్లింగ్ మూవీ సూపర్ హిట్ అయింది. కరుణాకర్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కాజల్ తమ్ముడిగా నటించాడు చైల్డ్ ఆర్టిస్ట్ గౌరవ్

Written By:
  • S Reddy
  • , Updated On : May 30, 2024 / 04:02 PM IST

    Prabhas Darling Movie Child Artist

    Follow us on

    Darling Movie: డార్లింగ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా? ఆ మూవీలో ప్రభాస్ ని, ఆయన గ్యాంగ్ ని అల్లాడిస్తూ ఉంటాడు ఈ కుర్రాడు. డార్లింగ్ మూవీలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్-ప్రభాస్(Prabhas) గ్యాంగ్ మధ్య వచ్చే సన్నివేశాలు భలే ఫన్నీగా ఉంటాయి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు గౌరవ్. ఇప్పుడు అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత గౌరవ్ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వస్తూనే ఓ భారీ ప్రాజెక్టు లో ఆఫర్ పట్టేశాడు.

    2010లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్ గా వచ్చిన డార్లింగ్ మూవీ సూపర్ హిట్ అయింది. కరుణాకర్(Karunakar)దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కాజల్ తమ్ముడిగా నటించాడు చైల్డ్ ఆర్టిస్ట్ గౌరవ్. ఈ సినిమాలో ఈ బుడ్డోడికి ప్రభాస్ కి అస్సలు పడదు. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లా గొడవ పడుతూ కనిపిస్తారు. ఒకరినొకరు ఆటపట్టించుకునే తీరు నవ్వులు పూయిస్తుంది.

    Also Read: OG Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఊహించని దెబ్బ… ఆ క్రేజీ మూవీ విడుదల వాయిదా!

    ఈ చిత్రం తర్వాత అనేక సినిమాల్లో గౌరవ్(Gaurav) చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. బాలకృష్ణ, నయనతార జంటగా నటించిన శ్రీరామ రాజ్యంలో గౌరవ్ నటించాడు. ఇందులో లవ కుశల పాత్రల్లో ఒకడిగా మెప్పించాడు. సినిమాల్లోకి రాక ముందు గౌరవ్ ఎన్నో స్టేజ్ షోస్ లో పార్టిసిపేట్ చేశాడు. అనేక డాక్యుమెంటరీలలో నటించాడు. రవితేజ, అనుష్క జంటగా నటించిన బలాదూర్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు.

    Also Read: Nivetha Pethuraj: పోలీసులకు అడ్డంగా బుక్ అయిన హీరోయిన్ నివేద పేతురాజ్… ఆ కారు డిక్కీలో ఏముంది?

    ఇందులో రవితేజ(Raviteja) చిన్నప్పటి పాత్రలో నటించాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో బాల నటుడిగా మెప్పించాడు. దాదాపు 20కి పైగా సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు పెద్దవాడైన గౌరవ్ హీరోగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం గౌరవ్ చేతిలో ఓ భారీ ప్రాజెక్టు ఉంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాలో గౌరవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.