Homeఅంతర్జాతీయం65 year old man marries 26 year old woman: 65 ఏళ్ల ముసలాడికి...

65 year old man marries 26 year old woman: 65 ఏళ్ల ముసలాడికి 26 ఏళ్ల యువతి తో పెళ్లి.. వైరల్ వీడియో

65 year old man marries 26 year old woman: అతడిది పింఛన్ తీసుకునే వయసు. ఇంకొకరి సాయం లేకుండా కనీసం ఒక అడుగు కూడా వేయలేడు. అటువంటి అతడు ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా 26 సంవత్సరాల యువతిని. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. మీకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.

పాకిస్తాన్ లో జరిగింది ఈ సంఘటన. ఇది కాస్త సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియోలో ఓ 65 సంవత్సరాల వృద్ధుడు ఓ ప్రాంతానికి వచ్చాడు. అతడిని కొంతమంది సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఒక మహిళ పానీయం ఇవ్వగా తాగాడు. ఆ తర్వాత అందంగా ముస్తాబు చేసిన పెళ్లి కుమార్తె చెయ్యి అందుకున్నాడు. ఆమె చేతికి ఒక కానుక ఇచ్చాడు. అనంతరం ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె కూడా ముఖానికి ముసుగు ధరించి గులాబీ రేకులను అతడి మీద చల్లింది. ఇదంతా కూడా ఆ దేశంలో వివాహ తంతులో జరిగే ఒక ప్రక్రియ.

పాకిస్తాన్ దేశంలో బహు భార్యత్వం అనేది నేరం కాదు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇష్టం ఉన్నన్ని రోజులు కాపురం చేయవచ్చు. ఆ తర్వాత విడాకులు ప్రకటించవచ్చు. అక్కడ నిఖా చేసుకోవడం.. తలాక్ ప్రకటించడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియలు. అంతేకాదు వృద్ధులు పడుచు యువతులను పెళ్లి చేసుకోవడం కూడా సర్వసాధారణమే. పైగా అక్కడ బాగా డబ్బున్న వృద్ధులు.. పైసలను ఎరవేస్తారు. అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. వారితో పిల్లల్ని కన్న తర్వాత విడాకులు చేస్తుంటారు.

గతంలో దుబాయ్ షేక్ లు.. అరబ్ షేక్ లు మనదేశంలో ఉన్న హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో పేద ముస్లిం అమ్మాయిలను డబ్బు ఆశ చూపించి పెళ్లి చేసుకునేవారు. ఆ తర్వాత వారిని తమదేశానికి తీసుకెళ్లేవారు. కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత విడాకులు ఇచ్చి ఇక్కడికి పంపించేవారు. అయితే మన ప్రభుత్వాలు ఇటువంటి విధానాల మీద ఉక్కు పాదాలు మోపడంతో గతంలో జరిగినట్టుగా ఇప్పుడు వివాహాలు జరగడం లేదు. దుబాయ్ షేక్.. అరబ్ షేక్ లకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారంతా జైలుకు వెళ్లి రావడంతో.. ఆ తరహా వివాహాలు ఇప్పుడు జరగడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version