Maharashtra: పక్కనే పులి.. బుడ్డోడా.. నీ ధైర్యానికి సెల్యూట్.. వైరల్ వీడియో

మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతం.. ఆ ప్రాంతంలో ఓ దంపతులు ఉంటున్నారు. వారి కి 12 సంవత్సరాల కుమారుడు మోహిత్ ఉన్నాడు. ఆ దంపతులు వేరే పని మీద బయటకు వెళ్లారు. దీంతో మోహిత్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.

Written By: Velishala Suresh, Updated On : March 7, 2024 8:43 am

Maharashtra

Follow us on

Maharashtra: పులి.. డిస్కవరీ ఛానల్ లో జింకను వేటాడుతున్న దృశ్యాలను చూస్తేనే జడుసుకుంటాం. ఒక్కోసారి చూడలేక కళ్ళు మూసుకుంటాం. ఎక్కడైనా పులి దాడి చేసిన వార్త పేపర్లో కనిపిస్తే వామ్మో అంటూ భయపడతాం. దాని గురించి రకరకాల చర్చలు చేసుకుంటాం. కానీ అలాంటిది కళ్ళ ముందు పులి కనిపిస్తే.. అది కూడా నేరుగా మనం ఉన్న ఇంట్లోకి వస్తే.. ఎలా ఉంటుంది? మనకైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గానీ.. ఈ 12 సంవత్సరాల బాలుడు మాత్రం ధైర్యంగా ఆ ముప్పు ఎదుర్కొన్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే..

అది మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతం.. ఆ ప్రాంతంలో ఓ దంపతులు ఉంటున్నారు. వారి కి 12 సంవత్సరాల కుమారుడు మోహిత్ ఉన్నాడు. ఆ దంపతులు వేరే పని మీద బయటకు వెళ్లారు. దీంతో మోహిత్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఫోన్ లో ఏదో ఆట ఆడుకుంటున్నాడు. ఇంటి ముందు తలుపు తెరిచి ఉండటంతో ఐదు అడుగుల పొడువు.. బలిష్టమైన దేహంతో ఉన్న ఓ చిరుత పులి నేరుగా ఇంట్లోకి వచ్చింది..సెల్ ఫోన్ లో ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. పులి వచ్చిందని భయపడకుండా.. అరిచి కేకలు వేయకుండా.. రెండు అడుగులు బయటకు వేసి బయట తలుపునకు గడియ పెట్టాడు. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇంట్లోకి నేరుగా చిరుత పులి వచ్చినా ఆ బాలుడు భయపడకుండా ధైర్యంగా తలుపు వేయడాన్ని చూసిన నెటిజన్లు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సమయస్పూర్తికి ఫిదా అవుతున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని అతడు స్థానికులకు చెప్పడంతో.. వారు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు వచ్చి మత్తుమందు ప్రయోగించి ఆ చిరుతపులిని బంధించి తీసుకెళ్లారు.. కాగా, ఈ సంఘటన ఆ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.