Indians Worldwide: ప్రపంచంలో భారతీయులు లేని దేశాలు ఇవే..?

రిపబ్లిక్‌ ఆఫ్‌ శాన్‌మారినో అని పిలుస్తారు. దేశం అన్నివైపులా ఇటలీ చుట్టముట్టి ఉంటుంది. ఇక్కడ జనాభా కేవలం 3,35,620. సౌకర్యాల విషయంలో ఈ దేశం చాలా వెనుకబడి ఉంది. భారతీయులెవరూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు.

Written By: Raj Shekar, Updated On : March 7, 2024 8:37 am

Indians Worldwide

Follow us on

Indians Worldwide: ఇండియన్‌.. ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో నివసిస్తున్న ప్రజలు. అందుకే ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అని గురజాడ అప్పట్లోనే రాశారు. భవిష్యత్‌ను ఆయన నాడే ఊహించారు. ప్రస్తుతం ఏ దేశంలో చూసినా భారతీయులు కచ్చితంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో భారతీయులు ఎక్కువగా నివసిస్తున్నారు. ప్రపంచంలోని 195 దేశాల్లో భారతీయులు ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు కోటి మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సిర్థ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నా.. భారతీయులు లేని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

వాటికన్‌ సిటీ..
వాటికన్‌ సిటీ ప్రపంచంలో అతి చిన్న దేశం. ఇది ప్రపంచవ్యాప్తంగా రోమన్‌ క్యాథలిక్‌ల ఆధ్యాత్మిక కేంద్రం. జనాభా పరంగా చిన్న దేశం. ఇక్కడ ఒక్క భారతీయుడు కూడా నివాసం ఉండడం లేదు.

శాన్‌ మారినో..
రిపబ్లిక్‌ ఆఫ్‌ శాన్‌మారినో అని పిలుస్తారు. దేశం అన్నివైపులా ఇటలీ చుట్టముట్టి ఉంటుంది. ఇక్కడ జనాభా కేవలం 3,35,620. సౌకర్యాల విషయంలో ఈ దేశం చాలా వెనుకబడి ఉంది. భారతీయులెవరూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు.

టువాలు..
ఆస్ట్రేలియాకు ఈశాన్యంలో పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న దేశం టువాలు. దీనిని పూర్వం ఎల్లిస్‌ ఐలాండ్‌గా పిలిచేవారు. ఇక్కడ కేవలం 10 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ 8 కిలోబీటర్ల పొడవునా వైద్య సౌకర్యాల పేరుతో ఒకే ఆస్పత్రి ఉంది. దేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్‌ వారు పాలించినా 1978లో స్వాతంత్య్రం వచ్చింది. అయితే ప్రస్తుతం ఇక్కడికి పర్యాటకులు కూడా రావడం లేదు. చాలా మంది వ్యాపారం కోసమే ఇక్కడకు వస్తారు. ఈ దేశం చాలా అందంగా ఉంటుంది. కానీ, ఇక్కడ భారతీయులు లేరు.

పాకిస్తాన్‌..
మన దాయాది దేశం పాకిస్తాన్‌. మన పొరుగు దేశమే అయినా భారతీయులెవరూ ఇక్కడ జీవనం సాగిచండం లేదు. ఇందుకు కారణం భారత్‌ – పాకిస్తాన్‌ రోజుకో వివాదం నెలకొనడమే. రాజకీయ విషయాల్లోనూ వివక్ష ఉంటుంది. అందుకే భారతీయువెలవరూ ఇక్కడకు వెళ్లడం లేదు.

బల్గేరియా..
బల్గేరియా ఆగ్నేయ ఐరోపాలో ఉన్న దేశం ఇది. 2019 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా 6,951,482. చాలా మంది క్రైస్తవాన్నే పాటిస్తున్నారు. ఇక్కడ కూడా భారతీయులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు.