Tiger: కారును ఎదురెళ్లి ఢీకొట్టిన పెద్దపులి.. కారు పరిస్థితి చూడాలి.. వైరల్ పిక్

బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో నెల్లూరు వెళ్తున్నారు, కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటి క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టింది.

Written By: Raj Shekar, Updated On : June 17, 2024 6:10 pm

Tiger

Follow us on

Tiger: పులి మనకు ఎదురొచ్చినా… పులికి మనం ఎదురెళ్లినా డెంజర్‌ మనకే.. ఇది తాజాగా నిరూపితమైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారుకు పెద్దపులి ఎదురెళ్లి ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో అందులోకి ప్రయాణికులు హడలిపోయారు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిసాడు మండలంలో కదిరినాయడుపల్లె సమీపంలో నెల్లూరు- ముంబై హైవేపై జరిగింది.

ఏం జరిగిందంటే..
బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో నెల్లూరు వెళ్తున్నారు, కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటి క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. కారు నేరం ఎక్కువగా ఉండడంతో పులిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్ శ్రీనివాసులు అప్రమత్తమై కారుకు బ్రేక్ వేశాడు. దీంతో పులి పైకిలేచి సమీపంలోని అడవిలోకి పారిపోయింది. అయితే అప్పటికే దాని కాళ్లకు గాయాలయ్యాయి.

ఊహించని ఘటనతో షాక్..
అనుకోకుండా ఎదురైన ఈ అనుభవానికి కారులోని ప్రయాణికులంతా షాక్ అయ్యారు. తమకు ఏమైనా అవుతుందేమో అని ఆందోళన చెందారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగానే ఉన్నారు. క్షేమంగా గమ్యస్థానం చేరుకున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. పులి పరిస్థితి తెలుసుకునేందుకు అడవిలో కూంబింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

ధ్వంసమైన కారు.
ఇదిలా ఉండగా పెద్దపులిని ఢీకొట్టడంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. బానెట్‌తోపాటు ముందు భాగంలోని బంపర్, లైట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, ఇంజిన్ కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. ఇదిలా ఉంటే.. పెద్దపులి తిరుగుతుందని తెలియడంతో మర్రిపాడు మండలంలోని అటవీ గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.