https://oktelugu.com/

Sangareddy: విద్యార్థులను ముద్దడిగిన ఉపాధ్యాయుడు.. షాకిచ్చిన గ్రామస్తులు!

ఇటీవల పాఠశాల ప్రారంభమైనా.. ఆ ముగుగరు బాలికలు బడికి వెళ్లడం లేదు. పీఈటీ ఉంటే భయంగా ఉందని, తాము బడికి వెళ్లమని ఆ బాలికలు మార్చిలో జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 17, 2023 / 02:17 PM IST

    Sangareddy

    Follow us on

    Sangareddy: ఆయన ఓ శుక్షితుడైన గురువు. విద్యార్థులకు నాణ్యమైన విద్యబోధిస్తాడని ప్రభుత్వం కొలువు కూడా ఇచ్చింది. పాఠాలు బోధిస్తూ.. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఆ ఉపాధ్యాడి బుద్ధి పత్పటడుగు వేసింది. తన పిల్లల్లా చూడాల్సిన విద్యార్థులతో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు విద్యార్థులను మంచిదారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడికే బడిత పూజ చేశారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో జరిగింది.

    పాఠశాల భవనంపైకి తీసుకెళ్లి..
    పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న సంగ్రాం.. మార్చిలో ముగ్గురు విద్యార్థినులను వేర్వేరుగా పాఠశాల భవనంపైకి తీసుకెళ్లాడు. అక్కడ వారిని తనకు ముద్దు పెట్టాలని అడిగాడు. వారు నిరాకరించడంతో భవనం పైనుంచి తోసేస్తానని భయపెట్టాడు. భయపడిన విద్యార్థినులు సదరు పీఈటీకి ముద్ద పెట్టారు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

    పాఠశాలల పునఃప్రారంభంతో..
    ఇటీవల పాఠశాల ప్రారంభమైనా.. ఆ ముగుగరు బాలికలు బడికి వెళ్లడం లేదు. పీఈటీ ఉంటే భయంగా ఉందని, తాము బడికి వెళ్లమని ఆ బాలికలు మార్చిలో జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన వారు గ్రామస్తులతో కలసి శుక్రవారం పాఠశాలకు వెళ్లారు. పీఈటీకి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ప్రధానోపాధ్యాయుడు గురునాథ్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయనపైనా దాడిచేశారు. సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. ఇదే సమయంలో బయటి నుంచి వచ్చిన హోంగార్డు ప్రతాప్‌ సింగ్‌ గ్రామస్తులను దూషించడంతో వారు అతడిపైనా చేయిచేసుకున్నారు. సంఘటన స్థలానికి డీఈవో వెంకటేశ్వర్లు, కంగ్టి సీఐ రాజశేఖర్‌ వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. పీఈటీ, హెచ్‌ఎంలను సస్పెండ్‌ చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీచేశారు. పీఈటీపై పోక్సో కేసు నమోదు చేస్తామని, హోంగార్డుపైనా చర్య తీసుకుంటామని సీఐ తెలిపారు.

    దారితప్పుతున్న గురువులు..
    గురువు అంటే సమాజంలో ఒక గుర్తింపు గౌరవం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉపాధ్యాయుడి మాటలను వేదంలా భావిస్తారు. బాగా చదువుకున్నోడు, అన్నివిషయాలపై అవగాహన ఉన్నోడు కాబట్టి మంచి చెబుతాడని నమ్ముతారు. కానీ, నేటితరం గురువులు ఆ విలువను పోగొట్టుకుంటున్నారు. వ్యసనాలకు అలవాటుపడి పిల్లలతో వికృత చేష్టలు చేస్తున్నారు. నయానో, భయానో లొంగదీసుకునేందుకు యత్నిస్తున్నారు. కొంతమంది గురువులు లైంగిక దాడిచేసిన ఘటనలూ ఉన్నాయి. గురువులు గాడి తప్పడానికి కూడా ఆన్‌డ్రాయిడ్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పిల్లలను పిల్లల్లా చూసే పరిస్థితి ఉండడం లేదని పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.