https://oktelugu.com/

Ola Electric Scooters : చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఓలా యాప్ ద్వారా తమ కొనుగోలును ఖరారు చేసే ముందు ఫైనాన్సింగ్ ఆప్షన్‌లపై వివరణాత్మక సమాచారం కోసం కస్టమర్‌లు తమ సమీప అనుభవ కేంద్రానికి (ఎక్స్పీరియన్స్ సెంటర్) వెళ్ళవచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2023 / 02:25 PM IST
    Follow us on

    Ola electric scooters : ఓలా కంపెనీ ఇప్పటికే ప్రయాణాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. చవకగా ప్రయాణాన్ని అందిస్తూ ప్రయాణికుల మనసు దోచింది. జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధితో మార్కెట్‌లో అతి తక్కువ వడ్డీ రేటును కంపెనీ ఆఫర్ చేసింది. ఇప్పుడు చవకైన వడ్డీ రేటుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది.

    భారతదేశపు అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, 2W సెగ్మెంట్‌లో దాని అత్యుత్తమ S1 స్కూటర్ లైనప్ మరియు లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌లతో EV స్వీకరణను ముందుండి నడుస్తుంది. IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో, జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లే సదుపాయం కల్పిస్తుంది ఓలా ఎలక్ట్రిక్. దీనితో, ఓలా ఎలక్ట్రిక్ EVలను మరింత సరసమైనదిగా మరియు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా #EndICEAgeకి తన నిబద్ధతను నొక్కి చెప్తుంది. కస్టమర్లు ఇప్పుడు పరిశ్రమ యొక్క అతి తక్కువ నెలవారీ EMIలతో మరియు జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌ కి యజమాని అవ్వవచ్చు.

    ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ: “మార్కెట్ లీడర్‌గా, మేము ప్రముఖ ఫైనాన్సింగ్ భాగస్వాములతో పొత్తులను ఏర్పరచుకున్నాము. టైర్ 1 లోనే కాకుండా టైర్ 2 మరియు 3 నగరాల్లో కూడా అత్యంత లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందిస్తున్నాము. భారతదేశం EV 2W స్వీకరణకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు మా ఫైనాన్సింగ్ ఆఫర్‌లు పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఫైనాన్సింగ్ ఎంపికలతో EVని సొంతం చేసుకునేందుకు అయ్యే ఖర్చు ఇప్పుడు ఏదైనా ICE వాహనాన్ని కొనడానికి అయ్యేఖర్చుతో పోలిస్తే సగం. మేము విధ్యుత్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి మరియు వాటిని అందరికీ ప్రధాన స్రవంతి ఎంపికగా చేయడానికి కట్టుబడి ఉన్నాము,” అని అన్నారు.

    ఓలా యాప్ ద్వారా తమ కొనుగోలును ఖరారు చేసే ముందు ఫైనాన్సింగ్ ఆప్షన్‌లపై వివరణాత్మక సమాచారం కోసం కస్టమర్‌లు తమ సమీప అనుభవ కేంద్రానికి (ఎక్స్పీరియన్స్ సెంటర్) వెళ్ళవచ్చు. ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ను ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో కూడా ఎంచుకోవచ్చు. ఓలా ప్రస్తుతం 700+ అనుభవ కేంద్రాలతో భారతదేశపు అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు ఆగస్టులో 1000వ ECని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది.

    S1 Pro, S1 మరియు S1 Air లతో కూడిన S1 లైనప్ అత్యాధునిక సాంకేతికత మరియు అసమానమైన పనితీరుతో కూడిన సొగసైన మరియు మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. కంపెనీ ఇప్పుడు వరుసగా మూడు త్రైమాసికాలుగా 2W EV విభాగంలో అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది.