https://oktelugu.com/

Viral Video: మొసలి నోట్లో కోతి.. అయినా సరే నిర్భయంగా ఏం చేసిందో తెలుసా?

ఓ మొసలి నోట్లో చిన్నపాటి కోతి పిల్ల చిక్కుకొని ఉంది. కానీ ఆ కోతి పిల్ల విడిపించుకునే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు తనకు మరణం అంటే భయం లేదన్నట్టుగా... ఈ క్షణమే ముఖ్యమైనట్టు.. నిర్భయంగా తనకు అందుతున్న ఆహారాన్ని తినడం మొదలు పెట్టింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 11, 2023 / 06:26 PM IST

    Viral Video

    Follow us on

    Viral Video: సాధారణంగా జంతువులకు సంబంధించి ఫన్నీ వీడియోలు, అరుదైన దృశ్యాలు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంటాయి. అటువంటివి కనిపిస్తే చాలు వెంటనే తమ స్నేహితులకు, స్నేహితులకు పంపిస్తుంటారు. ఇప్పుడు ఇలా పంపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒక క్రూర జంతువుకు దొరికిపోయిన ఓ చిరు జీవి… తాను చనిపోతున్నానని తెలిసినా.. అదరలేదు.. బెదరలేదు. పైగా ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేయడం విశేషం.

    ఓ మొసలి నోట్లో చిన్నపాటి కోతి పిల్ల చిక్కుకొని ఉంది. కానీ ఆ కోతి పిల్ల విడిపించుకునే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు తనకు మరణం అంటే భయం లేదన్నట్టుగా… ఈ క్షణమే ముఖ్యమైనట్టు.. నిర్భయంగా తనకు అందుతున్న ఆహారాన్ని తినడం మొదలు పెట్టింది. చూడడానికి భయంగా ఉన్నా ఫన్నీగా అనిపిస్తోంది. కానీ ఆ చిన్నారి కోతి నిర్భయాన్ని చూసి అందరూ అభినందిస్తున్నారు. క్రూరమైన జంతువు బారినపడి ప్రమాదకర స్థితిలో ఉన్నా.. బెరుకుతనం చూపించకపోవడం పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.

    అయితే ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఈ వీడియోను lendra.novero అనే ఖాతా ద్వారా ఇన్స్ట్రాగ్రామ్ షేర్ చేశారు. 3 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేసి.. కామెంట్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒకరు మొసలి నిద్రలేస్తే.. ఇక కోతికి తప్పించుకునే అవకాశం ఇవ్వదంటూ కామెంట్ చేయగా.. మరొకరి ఇది విరుద్ధమైన తెలివితేటలని తేల్చేశారు. చాలామంది రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.