Rajinikanth: హీరో రజినీకాంత్ కి దైవ చింతన ఎక్కువ. హిమాలయాల్లో ఉండే యోగులు, ఋషులు పట్ల అమిత విశ్వాసం కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలను సందరిస్తారు. అక్కడి ఆశ్రమాల్లో నిరాడంబర జీవితం గడుపుతారు. రజినీకాంత్ కి యోగ, చేతి వేళ్ళ ముద్రను పాటిస్తారు. రజినీకాంత్ ని ఖాళీ సమయాల్లో కూడా ఆయన కొన్ని యోగ ముద్రలతో కనిపిస్తారు. రజినీకాంత్ బొటని వేలు, చూపుడు వేలు కలిపి ఉంచుతారు.
అలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉందట. యోగ నిపుణులు దీన్ని చిన్ ముద్ర అంటారు. దీని వలన నరాలు శాంతించి మానసిక ప్రశాంతత కలుగుతుందట. సుఖ నిద్ర, జ్ఞాపకశక్తి మెరుగు కావడం వంటి ఫలితాలు ఉంటాయట. అందుకే నివాసంలో ఖాళీగా ఉన్నప్పుడు రజినీకాంత్ చిన్ ముద్రలో ఉంటారట. ఒకప్పుడు రజినీకాంత్ కి విపరీతమైన స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉండేదట.
ఈ చెడు అలవాట్ల నుండి యోగ కారణంగానే రజినీకాంత్ బయటపడ్డారట. ఏడు పదుల వయసు దాటినా కూడా రజినీకాంత్ ఇంత ఎనర్జిటిక్ గా ఉండటానికి కారణం యోగానే అట. కాగా రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ తో భారీ హిట్ కొట్టాడు. వరల్డ్ వైడ్ జైలర్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. రమ్యకృష్ణ, సునీల్ కీలక రోల్స్ చేశారు.
రజినీకాంత్ నెక్స్ట్ లాల్ సలామ్ మూవీలో కనిపించనున్నారు. ఈ మూవీలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. రజినీకాంత్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశాడు. లాల్ సలామ్ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తుంది. ఇక తన 170వ చిత్రం టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు. అనంతరం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మూవీ ప్రకటించారు.