Free Bus Travel: మహిళలకు ఫ్రీ బస్ రియాక్షన్స్.. పాపం కండకర్లు.. వీడియో వైరల్

బస్సుల్లో ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు అవసరమని ప్రచారం జరుగుతుండడంతో నిరక్షరాస్యులైన మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థినులు, చదువుకున్న మహిళలకు ఫ్రీ జర్నీపై అవగాహన ఉంటుంది.

Written By: Sekhar Katiki, Updated On : December 11, 2023 6:21 pm

Free Bus Travel

Follow us on

Free Bus Travel: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎని‍్నకల సమయంలో ఇచి‍్చన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించింది. దీంతో రెండు రోజులుగా ఆర్టీసీ బస్సులు ‘మహాలక్షి’లో కళకళలాడుతున్నాయి. ఉచిత ప్రయాణంతో బస్టాండ్లలో, బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. మూడు నాలుగు కిలోమీటర్ల దూరానికి ఇన్ని రోజులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లే మహిళలు, యువతులు కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు. దీంతో ప్రైవేటు వాహనాల గిరాకీ తగ్గింది. ఆర్టీసీకి డిమాండ్‌ ఏర‍్పడింది. మహిళా ప్రయాణికులు పెరగడంతో పురుషులు సీట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మినహా సూపరల్‌ లగ్జరీ, డీలక్స్‌, ఇంద్ర, గరుడ వంటి సర్వీసులు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి.

కండక్టర్ల పాట్లు..
బస్సుల్లో ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు అవసరమని ప్రచారం జరుగుతుండడంతో నిరక్షరాస్యులైన మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థినులు, చదువుకున్న మహిళలకు ఫ్రీ జర్నీపై అవగాహన ఉంటుంది. కానీ, గ్రామీణులు, ఇతర నిరక్షరాస్యులైన మహిళలు మాత్రం ఉచిత ప్రయాణంపై అవగాహన లేక ఇబ్బంది పడుతునా‍్నరు. బసు‍్స ఎక్కాక కండక్టర్‌ను సమాచారం అడుగుతున్నారు. ఉచితమా కాదా, ఎలాంటి గుర్తింపు కార్డు కావాలి, ఎక్కడిదాక ఫ్రీ, తర్వాత టికెట్‌ తీసుకోవాలా.. లాంటి ప్రశ్నలతో కండక్లర్లను ఉకి‍్కరిబిక్కిరి చేస్తురు. అందరికీ సమాధానం చెప్పలేక కండక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎలాంటి గుర్తింపు కార్డు అసవరం లేదని చెప్పినా.. మరి ఎప్పటి నుంచి అవసరం.. ఏయే కార్డులు తీసుకురావాలని అడుగుతున్నారు. దీంతో సమాధానం చెప్పలేక కండక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ‘‘ఓ బస్సులో ప్రయాణిస్తున్న నిరక్షరాస్యురాలు అయిన మహిళను టీవీ ప్రతినిధి ఉచిత ప్రయాణంపై ఏమనుకుంటున్నారు’’ అని అడిగింది. ఏం అనుకుంటలేం అని సదరు మహిళ షాకింగ్‌ సమాధానం ఇచ్చింది. ఇక కండక్టర్‌ రాగానే.. సారూ నాదగ్గర ఆధార కారట.. గీదారు కారట ఏం లేవు.. నను‍్న ఫ్రీగ తీసుకపోతరా అని అడిగింది. తప‍్పకుండా తీసుకెళ్తామని చెప్పినా.. ఎక్కడిదాక తీసుకుపోతరని అడిగింది. ఎక్కడికంటే.. అక్కడికి తీసుకుపోత అంటే.. ఓ అయ్యా నేను ఫలానీ ఊరికే పోవాలి.. నా మొగుడు ముంగట ఉన్నడు’ అని చెప్పడంతో కండక్టర్‌ కంగుతిన్నాడు.

మొత్తంగా ఫ్రీ జర్నీ కారణంగా పురుష ప్రయాణికులతోపాటు కండక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ ఫ్రీ బస్సులపై పోస్టర్లు కూడా అంటించింది. ప్రయాణికులంతా గుర్తుపట్టేందుకు ఇలా చేశారు అధికారులు, ఇక కొంతమంది కండక్లర్లు మహిళల దగ్గరకు వెళ్లడం మానేశారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలా అవైడ్‌ చేస్తున్నారు.