Homeట్రెండింగ్ న్యూస్Yadadri District : ఏడేళ్ల పాటు సంసారం.. ఇప్పుడు భార్య బాగాలేదని వేరే యువతితో...

Yadadri District : ఏడేళ్ల పాటు సంసారం.. ఇప్పుడు భార్య బాగాలేదని వేరే యువతితో…

భార్య అందంగా లేదని ఇప్పుడు తెలిసిందా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పూజతో పాటు పిల్లలకు న్యాయం చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. 

Yadadri District : ఏడేళ్ల పాటు ఆమెతో సంసార జీవితం గడిపాడు. ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు భార్య అందంగా లేదని వేరే యువతిని తగులుకున్నాడు. దీంతో బాధిత మహిళ తన ఇద్దరి పిల్లలతో పోరాటానికి దిగింది. ఆమెకు స్థానికులు, ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి.

మోటకొండూరు మండలం ముత్తిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన రాజేష్ కు పూజ అనే యువతితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సవ్యంగా సాగుతున్న వీరి జీవితంలో మరో యువతి వచ్చింది. భర్త ఆమె మజాలో పడి భార్య, ఇద్దరు పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. ఇటీవల ఏకంగా యువతిని ఇంటికి తెచ్చాడు. భార్య పూజా ప్రశ్నిస్తే నువ్వు అందంగా లేవు.. అందుకే ఆ యువతితో సంబంధం పెట్టుకున్నానని నిస్సిగ్గుగా చెప్పాడు. ఆమె పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోలేదు.

దీంతో పూజా తనకు జరిగిన అన్యాయం పోరాటానికి దిగింది. సోమవారం సాయంత్రం ముత్తిరెడ్డిగూడెంలోని చాడ రోడ్డుపై ఇద్దరు పిల్లలతో బైఠాయించింది. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. స్థానికులు అడ్డుకున్నారు. పూజతో పాటు పెద్దఎత్తున బైఠాయించారు. ఈ విషయంలో ఊరు ఊరే ఏకమైంది. భార్య అందంగా లేదని ఇప్పుడు తెలిసిందా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. పూజతో పాటు పిల్లలకు న్యాయం చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper