Mahesh Babu adopted his fan childrens
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్ప మానవతావాది. ఏళ్లుగా ఆయన సామాజిక సేవ చేస్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మహేష్ కొడుకు గౌతమ్ నెలలు నిండకుండానే పుట్టాడట. అసలు బ్రతుకుతాడా లేదా అని మహేష్, నమ్రత చాలా కంగారు పడ్డారట. ఖరీదైన వైద్యం అందడంతో గౌతమ్ కోలుకున్నాడట. అప్పుడే మహేష్ కి ఒక ఆలోచన వచ్చిందట. మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి పిల్లాడిని బ్రతికించుకున్నాం… పేద తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని, ఆవేదన చెందారట.
మహేష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన హృదయ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న చిన్నారులకు ఆపరేషన్స్ చేయిస్తున్నారు. వందల మంది చిన్నారులు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వైద్య సహాయం పొందారు. తాజాగా ఆపదలో ఉన్న అభిమాని కుటుంబానికి మహేష్ అండగా నిలిచాడు. కృష్ణాజిల్లా పెదప్రోలు కు చెందిన రాజేష్… కృష్ణ కుటుంబానికి వీరాభిమాని. అప్పట్లో కృష్ణను, ఇప్పుడు మహేష్ బాబును ఆయన అమితంగా అభిమానిస్తున్నాడు.
Also Read: Prabhas: ప్రభాస్ తో మల్టీ స్టారర్ సినిమాకి సై అంటున్న బాలీవుడ్ స్టార్ హీరో…
రాజేష్ దురదృష్టవశాత్తు కిడ్నీ వ్యాధి బారిన పడ్డాడు. దీంతో కుటుంబ పోషణ బరువైంది. ఈ విషయం మహేష్ బాబు దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పందించిన మహేష్ బాబు అభిమాని రాజేష్ ఇద్దరు కుమారులను దత్తత తీసుకున్నాడు. వారి చదువు, పోషణ బాధ్యత తీసుకున్నారు. అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేష్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. మహేష్ రియల్ హీరో అంటున్నారు.
Also Read: Kalki 2898 AD: కల్కి సినిమాలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారంటే..?
అలాగే మహేష్ బాబు ఏపీ/ తెలంగాణ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అందులో కృష్ణ పుట్టిన బుర్రిపాలెం ఒకటి. ఆ రెండు గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలు మహేష్ బాబు సొంత ఖర్చుతో సమకూర్చారు. మరోవైపు మహేష్ బాబు నెక్స్ట్ మూవీకి సిద్ధం అవుతున్నారు. మహేష్ తన 29వ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఎస్ఎస్ఎంబీ 29 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Web Title: Mahesh babu adopted his fan childrens