సెటైర్ : దెబ్బకు హరీష్ రావు పాలు అమ్ముతున్నాడు… కేటీఆర్ ఆ మజాకా?

తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకుడు హరీష్ రావు రాష్ట్రమంతటా అశేష ప్రజాదరణ కలిగిన నేత. కేసీఆర్, కేటీఆర్ తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుండి వినిపించే పేరు అతనిదే. కెసిఆర్ కు సొంత వాడైన హరీష్ రావు ని ముఖ్యమంత్రివర్యులు అతని కుమారుడి కోసం కావాలని సైడ్ చేస్తున్నారని వస్తున్న విమర్శలు ఇప్పటివి కాదు. ఇక తాజాగా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం జరగబోతుందని… కేసీఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమితం […]

Written By: Navya, Updated On : August 22, 2020 12:35 pm
Follow us on

తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకుడు హరీష్ రావు రాష్ట్రమంతటా అశేష ప్రజాదరణ కలిగిన నేత. కేసీఆర్, కేటీఆర్ తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుండి వినిపించే పేరు అతనిదే. కెసిఆర్ కు సొంత వాడైన హరీష్ రావు ని ముఖ్యమంత్రివర్యులు అతని కుమారుడి కోసం కావాలని సైడ్ చేస్తున్నారని వస్తున్న విమర్శలు ఇప్పటివి కాదు. ఇక తాజాగా త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం జరగబోతుందని… కేసీఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతారని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read : నారా లోకేష్.. గెలుపు పొందేవరకు అలుపు లేదట!

దీంతో తెలంగాణ ప్రజలంతా సెటైరికల్ గా అందుకే టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు…. అతని భార్య శ్రీనిత పాల ఉత్పత్తులు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు అని అంటున్నారు. తాజాగా దంపతులిద్దరూ.. తాము ఇలా పాల ఉత్పత్తుల వ్యాపారంలో అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మిల్క్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన వివరాలను హరీష్ రావు భార్య శ్రీనిత మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు.

ముందు నుండి కేటీఆర్ కు, హరీష్ రావు కి పార్టీ నాయకత్వం విషయంలో విభేదాలు ఉన్నాయని తెరాస వర్గాలు చెబుతుంటాయి. ఇక ఎవరికి వారు వర్గాలుగా సపరేట్ గా విడిపోయి ఉంటారు. కెసిఆర్ కూడా వీరిద్దరి మధ్య సయోధ్య లేక అతని కొడుకు వైపు మొగ్గు చూపుతున్నారని…. ఇక హరీష్ రావుని పూర్తిగా సైడ్ చేస్తే అది తన పార్టీ భవిష్యత్తుకి…. తన ప్రస్థానాన్ని కే చెడ్డ పేరు తెస్తుంది అని భావించి హరీష్ రావుని కూడా కలుపుకొని వెళుతుంటారు అన్నది సగం మంది తెలంగాణ ప్రజల భావన.

అయితే హరీష్ రావు మాత్రం తాను ఎప్పుడూ పార్టీ విధేయుడనేనని…. కేసీఆర్ బంటునే అన్నట్లు వ్యవహరిస్తారు. కానీ కేటీఆర్ ధోరణి మాత్రం కచ్చితంగా అలా ఉండదు అన్నది విశ్లేషకుల మాట. నిదానంగా హరీష్ రావు ప్రాముఖ్యతను పార్టీలో తగ్గించేందుకు అతను ఎన్ని కావాలంటే అన్ని వ్యూహాలు రచిస్తాడని.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతున్న దశలో కేటీఆర్ ఇక హరీష్ రావు పేరుని గులాబీ పార్టీ లో వినపడకుండా ఉండేందుకు తగిన ప్రయత్నాలు చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నది రాజకీయ నిపుణుల మాట.

ఇక అందుకు తగ్గట్టుగానే తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది కాబట్టి ఒక బ్యాక్ అప్ ప్లాన్ గా హరీష్ రావు ఈ పాల ఉత్పత్తులు వ్యాపారాన్ని పెట్టారని…. అతని ముందు చూపు కి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే అని రాష్ట్ర ప్రజలతో పాటు టీఆర్ఎస్ క్యాడర్ కూడా సెటైర్లు వేస్తున్నారు. మరి హరీష్ అలాంటి వారందరికీ సమాధానం ఇస్తాడా….? లేక…. కేటీఆర్ అందరూ అంటున్నంత పని చేస్తాడా….?

Also Read : టీఆర్ఎస్ నేతకు గాలం వేస్తున్న బీజేపీ.. వర్కౌట్ అవుతుందా?