Homeటాప్ స్టోరీస్Yamaha R15 V4: బైక్ ప్రియులకు "డబుల్" గుడ్ న్యూస్ చెప్పిన యమహా.. క్విక్ షిఫ్టర్...

Yamaha R15 V4: బైక్ ప్రియులకు “డబుల్” గుడ్ న్యూస్ చెప్పిన యమహా.. క్విక్ షిఫ్టర్ లో 2 వేరియంట్లు..

Yamaha R15 V4: స్పోర్ట్స్ బైక్ ల తయారీలో యమహా కంపెనీకి తిరుగులేదు. ప్రీమియం మోడల్స్ మార్కెట్ లోకి తీసుకురావడంలో ఈ కంపెనీ ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. కొత్త కొత్త మోడల్స్.. అద్భుతమైన ఫీచర్లు. డిజైన్. ఇలా ఏ విషయంలో కూడా యమహా కంపెనీ కాంప్రమైజ్ కాదు. తాజాగా యమహా కంపెనీ తన స్పోర్ట్స్ బైక్ R15 V4 లో క్విక్ షిఫ్టర్ ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. అయితే మరో రెండు కొత్త నమూనాలకు దీనిని విస్తరించింది. […]

Yamaha R15 V4: స్పోర్ట్స్ బైక్ ల తయారీలో యమహా కంపెనీకి తిరుగులేదు. ప్రీమియం మోడల్స్ మార్కెట్ లోకి తీసుకురావడంలో ఈ కంపెనీ ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. కొత్త కొత్త మోడల్స్.. అద్భుతమైన ఫీచర్లు. డిజైన్. ఇలా ఏ విషయంలో కూడా యమహా కంపెనీ కాంప్రమైజ్ కాదు.

తాజాగా యమహా కంపెనీ తన స్పోర్ట్స్ బైక్ R15 V4 లో క్విక్ షిఫ్టర్ ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. అయితే మరో రెండు కొత్త నమూనాలకు దీనిని విస్తరించింది. కొత్త రంగులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్ 15 కంటే కూడా అత్యున్నత స్థాయిలో ఉండే R2 బైక్ ను యమహా. అయితే కొద్ది రోజులకే ఈ మార్పును అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

యమహాలో ఇప్పటివరకు టాప్ వేరియంట్ R15 M కు మాత్రమే క్లచ్ లేకుండా గేర్ ఉపయోగించుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు R15 V4 మోడల్ లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. R15 V4 మోడల్ లో intensity white రంగు వేరియంట్ లో క్విక్ షిఫ్టర్ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఇప్పుడు రేసింగ్ బ్లూ, Matte pearl white రంగులకు కూడా ఈ సౌలభ్యం యమహా అందించింది.. మనదేశంలో R15 V4 మోడల్ లో intensity white, racing blue, Matte pearl white లో మాత్రమే క్విక్ షిఫ్టర్ సదుపాయం ఉంది..

క్విక్ షిఫ్టర్ సౌలభ్యం ఉన్న R15 V4 వేరియంట్ ధర 1,79,500 గా ఉంది. క్విక్ షిఫ్టర్ లేని వేరియంట్ ధరను 1,74,850 గా కంపెనీ ప్రకటించింది. అయితే ఈ సదుపాయం కోసం కస్టమర్ అదనంగా 4650 చెల్లించాలి. అయితే స్పోర్ట్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు క్లచ్ లేకుండా గేర్ మార్చుకోవడాన్ని చాలామంది ఇష్టపడుతున్నారు. అయితే దీనికోసం కంపెనీ అదనపు ధర వసూలు చేస్తున్న నేపథ్యంలో కస్టమర్లు సానుకూలంగానే స్పందిస్తున్నారు.

“ఈ సదుపాయం అద్భుతంగా ఉంది. కాకపోతే దీని కోసం కంపెనీ అదనపు చార్జి వసూలు చేస్తోంది. ఇది సమంజసం గానే అనిపిస్తోంది. కాకపోతే స్పోర్ట్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు క్లచ్ లేకుండా గేర్ మార్చుకోవడం మంచి నిర్ణయం. దీనివల్ల రైడర్లకు వెంటనే గేర్ మార్చుకోవడం ఈజీ అవుతుంది. బండి వేగాన్ని అంచనా వేయడం కూడా సులభం అవుతుంది. ఈ నిర్ణయం స్పోర్ట్స్ రైడర్లకు ఎంతగానో అనుకూలంగా ఉంటుందని” వాహన ప్రియులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper