Homeటాప్ స్టోరీస్Hyderabad Real Estate: ఆఫ్ట్రాల్ పది కోట్లేనా.. హైదరాబాద్ లో ఇలా మారిపోయింది పరిస్థితి..

Hyderabad Real Estate: ఆఫ్ట్రాల్ పది కోట్లేనా.. హైదరాబాద్ లో ఇలా మారిపోయింది పరిస్థితి..

Hyderabad Real Estate: అవసరాలు పెరుగుతుంటే.. కొత్త కొత్త అవకాశాలు తెర మీదకి వస్తుంటాయి. అవకాశాలు అందుపుచ్చుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. అవకాశాలు వ్యాపారాలను సృష్టిస్తుంటాయి. వ్యాపారాలు పెరిగితే మనీ స్పెక్యులేషన్ ఉంటుంది. అప్పుడు డబ్బులకు విలువ తగ్గిపోతుంది. అలాంటప్పుడు డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే.. వారికే సమాజం విలువ ఇస్తుంది. డబ్బు ఎక్కువ ఉన్నవారు సహజంగానే ఖర్చు ఎక్కువ పడుతుంటారు. అలాంటప్పుడు వస్తువుల ధర పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఆర్థిక అంతరం కూడా పెరుగుతుంది. […]

Hyderabad Real Estate: అవసరాలు పెరుగుతుంటే.. కొత్త కొత్త అవకాశాలు తెర మీదకి వస్తుంటాయి. అవకాశాలు అందుపుచ్చుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. అవకాశాలు వ్యాపారాలను సృష్టిస్తుంటాయి. వ్యాపారాలు పెరిగితే మనీ స్పెక్యులేషన్ ఉంటుంది. అప్పుడు డబ్బులకు విలువ తగ్గిపోతుంది. అలాంటప్పుడు డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే.. వారికే సమాజం విలువ ఇస్తుంది. డబ్బు ఎక్కువ ఉన్నవారు సహజంగానే ఖర్చు ఎక్కువ పడుతుంటారు. అలాంటప్పుడు వస్తువుల ధర పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఆర్థిక అంతరం కూడా పెరుగుతుంది.

ఇప్పటి కాలంలో లక్షలు పెద్ద లెక్కలోకి లేకుండా పోయాయి. ఇదే సమయంలో కోట్లు కూడా అదే జాబితాలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రీమియం లగ్జరీ విభాగంలో హైదరాబాద్ నగరంలో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. వాస్తవానికి హైదరాబాదు నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అయిందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అలా అనిపించడం లేదు.

హైదరాబాద్ నగరంలో గృహాల విక్రయాలు ఒకచోట ఒక విధంగా.. మరొకచోట మరో విధంగా ఉన్నాయి. అయితే ప్రీమియం.. లగ్జరీ విభాగాలలో గృహాలను చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఐటి హబ్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఏరియాలలో గృహాల మార్కెట్ సరికొత్త విధంగా దూసుకుపోతోంది. కోట్ల రూపాయల ప్రాజెక్టులు లాంచ్ కావడం.. వెంటనే అమ్ముడుపోవడం వంటివి జరిగిపోతున్నాయి.

హైదరాబాద్ నగరంలో గతంలో మూడు నుంచి ఐదు కోట్ల విలువైన గృహాలను లగ్జరీలుగా భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 8 నుంచి 15 కోట్ల విలువైన ధర పలికే విల్లాలు నేడు అత్యంత లగ్జరీగా మారిపోతున్నాయి. ప్రముఖ బిల్డర్లు నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులలో విల్లాలు దక్కించుకోవడానికి శ్రీమంతులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. కంపెనీలు కేవలం కాగితాల మీద మాత్రమే గ్రాఫిక్ డిజైన్లు చూపిస్తున్నాయి. ఫ్రీ లాంచ్ లేదా లాంచింగ్ దశలోనే కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. శ్రీమంతుడు కూడా డబ్బులు చెల్లించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. దీన్నిబట్టి డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చాలామంది కొనుగోలు దారుల ప్రొఫైల్ పూర్తిగా మారిపోయింది. వారి ఆదాయాలు విపరీతంగా పెరిగిపోయాయి.. ఐటి.. ఫార్మా.. బ్యాంకింగ్.. ఫైనాన్స్ వట్టి రంగాలలో స్థిరపడిన వ్యాపారులు విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. పటిష్టమైన భద్రత.. క్లబ్ హౌస్ వసతి.. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్.. ఇంకా ఉద్యానవనాలు.. అంతర్జాతీయ విలాసాలతో కూడిన హై ఫైవ్ ప్రైవేట్ కమ్యూనిటీ లైఫ్ కోరుకుంటున్నారు. అందువల్ల ఈ స్థాయిలో డబ్బు ఖర్చుపెట్టి విల్లాలు కొనుగోలు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper