Homeటాప్ స్టోరీస్Ghostlighting In Dating: ప్రేమలో కొత్త వెరైటీ 'ఘోస్ట్‌ లైటింగ్'

Ghostlighting In Dating: ప్రేమలో కొత్త వెరైటీ ‘ఘోస్ట్‌ లైటింగ్’

Ghostlighting In Dating: నిన్నటి వరకు ప్రేమలో మునిగి తేలి, ఇవాళ అడ్రస్ లేకుండా పోయే ‘ఘోస్టింగ్’ పాత మోడల్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లోకి ‘గోస్ట్‌లైటింగ్’ అనే లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వచ్చేసింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే.. అవతలి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తూ దొరికిపోయినా, “అసలు నీ కళ్లే సరిగ్గా చూడలేదు, నీ బుర్ర పని చేయడం లేదు” అని నమ్మించి, చివరికి మిమ్మల్నే మోకాళ్లపై నిలబెట్టి సారీ చెప్పిస్తారు!

Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో!

ఆపరేషన్ మానిప్యులేషన్: అసలు ఏం జరుగుతుందంటే?

ఈ గోస్ట్‌లైటింగ్ బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, సినిమాలో విలన్ కొడుతుంటే హీరో “ఎందుకు కొడుతున్నావ్?” అని అడగాలి. కానీ ఇక్కడ హీరో, “నన్ను కొడుతున్నందుకు నీ చెయ్యి నొప్పి పుడుతుందేమో, ఐ యామ్ సారీ” అని విలన్‌కి మందు రాసినట్టు ఉంటుంది. వారు రిప్లై ఇవ్వరు.. ఎందుకు అని అడిగితే, “నువ్వు మరీ ఇంత పొసెసివ్‌గా ఉంటే నేను బ్రతకలేను” అని రివర్స్ లో డైలాగులు కొడతారు. “నేను అలా ఎప్పుడూ అనలేదు, నీకేదో భ్రమగా ఉంది” అని చెప్పి, ఉన్న నిజాన్ని కూడా అబద్ధం చేసేస్తారు. పాపం బాధితులు నిజంగానే గజినీ లాగా తమ మెమరీని తామే అనుమానించుకుంటారు. అకస్మాత్తుగా మాయమైపోయి, మళ్ళీ ఎప్పుడో తీరిగ్గా వచ్చి “నువ్వు బిజీగా ఉన్నావని నేనే డిస్టర్బ్ చేయలేదు” అని బిల్డప్ ఇస్తారు. అంటే మాయమైంది వాడు, తప్పు మాత్రం మీదే!

ప్రమాద హెచ్చరిక: ఎలా గుర్తుపట్టాలి?

మీ పార్ట్నర్ కింది లక్షణాలు చూపిస్తుంటే, మీరు ప్రేమలో లేరు.. ఒక ‘సైకలాజికల్ థ్రిల్లర్’ సినిమాలో ఉన్నారని అర్థం చేసుకోండి. తప్పు చేసినా వాళ్ల ముఖంలో అపరాధ భావం అస్సలు ఉండదు. మీరు ఏదైనా అడిగితే “నీకు పిచ్చి పట్టింది” అని ఈజీగా అనేస్తారు. మీ ఆత్మగౌరవం ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుంటే వెంటనే అలర్ట్ అవ్వండి.

ప్రేమ అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు సిఐడి ఇన్వెస్టిగేషన్లు చేసుకోవడానికి కాదు. ఎవడో ‘గోస్ట్’ లాగా మాయమై, మిమ్మల్ని ‘లైట్’ లో పెట్టి ఆడుకుంటుంటే.. ఆ లైట్ తీసి వాడి నెత్తి మీద పెట్టి, సాగనంపడమే ఉత్తమం.

మానసిక ప్రశాంతత ముఖ్యం బిగులు! ఎవడో అబద్ధాలకోరు కోసం మీ మెదడుని ఫ్రై చేసుకోకండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి, లేదంటే మీ జీవితం ఓ ‘హారర్ కామెడీ’ అయిపోతుంది!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular