Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందంతో పాటు అభినయంతో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించినప్పటికీ.. భలేభలే మగాడివోయ్ సినిమాతో మంచి ఫేమ్ దక్కించుకుంది. ఈ రోజు లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆమె సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు తెలుసుందాం.
ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో అతికొద్ది మంది అద్భుతమైన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. అయితే, వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. అన్ని సినిమాలు విజయాన్ని అందుకుంటున్నప్పటికీ.. వ్యక్తిగతంగా లావణ్యకు స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం దక్కడం లేదు. దీని గురించే ఆమెను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. ఎందులో పడితే అందులో నటించడం కంటే.. ఇంట్లో కూర్చోవడం బెటర్ అని కరాఖండిగా సమాధానమిచ్చింది. ప్రస్తుతం లావణ్య తెలుగు, తమిళ భాషల్లో విభిన్న పాత్రల్లో నటిస్తోంది.
Also Read: త్వరలో నటిగా పరిచయం కానున్న మిస్ యూనివర్స్.. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్
స్క్రిప్ట్ నచ్చితే ఆ సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా రెడీ అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల దక్షిణాది సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న లావణ్య.. డేట్లు కుదరక బాలీవుడ్లో వచ్చిన అవకాశాలను వదులుకుందట.
కాగా, తెలుగులో ఇటీవలే అర్జున్ సురవరం విజయం తర్వాత 2021లో ఏ1 ఎక్స్‌ప్రెస్, చావుకబురు చల్లగా వంటి చిత్రాలతో మంచి హిట్ అందుకుంది. అందులో రావణ్య త్రిపాఠి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా చవుకబురు చల్లగా సినిమాలో భర్త లోి పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించడం విశేషం. ఇలా వరుసగా నచ్చిన ప్రాజెక్టుల్లోనే నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకుంది లావణ్య.
Also Read: ఆ విషయంలో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా- సాయిపల్లవి
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Tollywood actress lavanya tripathi birthday special story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com