Namasthe Telangana: తెలంగాణ ఉద్యమానికి ప్రయారిటీ దక్కనప్పుడు లక్ష్మీరాజం ఆధ్వర్యంలో పురుడు పోసుకుంది నమస్తే తెలంగాణ. ఆ తర్వాత కొంతకాలానికి అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ చేతుల్లోకి వెళ్లిపోయింది.. ఉద్యమ సమయంలో ఎలాంటి నిప్పులు చిమ్మిందో.. కెసిఆర్ చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత అంత బిగుసుకుపోయింది. ప్రతిపక్షాల మీద బురద చల్లడం.. విషం చిమ్మటం.. అధికార పార్టీకి ముఖ్యంగా కేసీఆర్ కుటుంబానికి డప్పు కొట్టడం దానికి అలవాటైపోయాయి. కానీ ఏ ఆకాంక్షల కోసం ఆ పత్రిక ఏర్పాటయిందో.. అవన్నీ కాలానుగతిలో కొట్టుకుపోయాయి.. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కాబట్టి.. అధికారంలో ఉన్న పది సంవత్సరాలు నమస్తే తెలంగాణ అడ్డగోలుగా రాసింది. అడ్డగోలుగా జాకెట్ యాడ్స్ దక్కించుకుంది.. ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి దాని మేనేజ్మెంట్ కు ఇన్నాళ్లు పనిచేసిన ఉద్యోగులు గుది బండ లాగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా అంతకంతకు విస్తరిస్తున్న క్రమంలో ఇక ఈ నమస్తే ఈ స్థాయిలో ఎందుకు అనే నిర్ణయానికి వచ్చారు. అధికారం పోయి 15 రోజులు కూడా కాకముందుకే ఉద్యోగుల్లో మందిని పిలిచి మీరు బయటకు వెళ్లిపోండి అని ముఖం మీద చెప్పేస్తున్నారు.. కానీ ఇక్కడే నమస్తే తెలంగాణ అవసరం అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భారత రాష్ట్ర సమితి అత్యవసరం.. ఈ విషయం చెబుతోంది కూడా నమస్తే తెలంగాణ నే.. ఎందుకంటే..
ఆ పత్రిక రాసిన ఒక బ్యానర్ వార్త అందుకు ఉదాహరణ. పరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాడు. అయితే ఆ మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తన పోలీస్ సిబ్బందిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీదకి ఉసిగోల్పాడు. ఇక్కడ ఎన్నికల వాతావరణం రసవత్తరంగా ఉండటంతో చాలామంది ముఖ్యంగా ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేయలేదు. పైగా నాగార్జునసాగర్ మీద గొడవ జరగడంతో అది పీకే స్క్రిప్ట్ అని ప్రచారం జరిగింది.. కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు గొడవ వెనక రాయలసీమ లిఫ్ట్ పనులను జగన్ సైలెంట్ గా నడిపించడం ప్రారంభించాడు. అంతేకాదు పోతిరెడ్డిపాడు పొక్కను మరింత వెడల్పు చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి వార్తలను పచ్చ మీడియా రాయదు. అలాగని జగన్ ప్రభుత్వాన్ని వెనకేసుకురాదు. తెలంగాణ ప్రయోజనాలకు గండిపడుతుందని గుండెలు బాదుకోలేదు. ఎందుకంటే ఈ లిఫ్ట్ వల్ల రాయలసీమ ముఖ చిత్రం ఎలా మారిపోతుందో ఆ పచ్చ మీడియాకు తెలుసు.. ఇక తెలంగాణ ఓనర్లుగా ఉన్న టీవీ9 ఈ వార్తను పబ్లిష్ చేయలేదు. ఎందుకంటే దాని మేజర్ హెడ్స్ అన్ని ఆంధ్ర ప్రాంతానివే.. ఇక ఎన్టీవీ.. ఇలాంటి వార్తలు జోలికి వెళ్లదు. టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. మరి అలాంటప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నమస్తే మాత్రమే రాయగలదు. అది అధికారంలో ఉన్న దాని కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భారత రాష్ట్ర సమితికి మరింత అవసరం. ఇలాంటప్పుడే దానిని వారు మరింత కాపాడుకోవాలి. నిన్నటిదాకా అధికారంలో ఉన్నవాళ్లు ఒక ఐదు సంవత్సరాలు పాటు పేపర్ నడిపియలేమని చేతులెత్తేసారంటే దాన్ని ఏమనుకోవాలి.
అయితే నమస్తే తెలంగాణ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉంది కాబట్టి ఈ వార్త రాసింది. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును అడ్డుకునే కనీస ప్రయత్నం ఎందుకు చేయలేదు.. పైగా ఇప్పుడు అధికారంలో ఉండి ఉంటే జగన్ కు కచ్చితంగా ఎంతో కొంత సహాయం కూడా చేసి ఉండేవాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిష్ఠురమైన సత్యం. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేడు కాబట్టి నమస్తే తెలంగాణకు హఠాత్తుగా తెలంగాణ ప్రయోజనాలు గుర్తొచ్చాయి. అందుకే ఈ తప్పు మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే అనే యాంగిల్ లో నమస్తే తెలంగాణ కథనాన్ని వండి వార్చింది. కేవలం నమస్తే తెలంగాణ మాత్రమే కాదు నిన్నటిదాకా కేసీఆర్ కు అమ్ముడుపోయిన కలాలు, గళాలు కూడా ఇప్పుడు స్పందిస్తాయి. మొన్నటిదాకా మూసుకుపోయి ఇప్పుడు తెరుచుకున్న ధర్నా చౌక్ లో నినదిస్తాయి. ఇదే నమస్తే తెలంగాణ మొదటి నుంచి ఉన్న స్టాండును ఫాలో అయితే ఇవాళ ఇంత తిప్పలు వచ్చేది కాదు. ఏ విధంగానైతే కేసీఆర్ తెలంగాణ వ్యతిరేక శక్తులను తన నెత్తి మీద పెట్టుకున్నాడో.. అదేవిధంగా గులాబీ భజనను నమస్తే తనకు అలవాటుగా మార్చుకుంది. అయితే ఈ ప్రక్రియలో ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకుంటే ఎవరు నమ్ముతారు.. నవ్వి వెళ్లిపోవడం తప్ప..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: That is the biggest mistake namasthe telangana is making
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com