Hyderabad : దేశం మొత్తం అభివృద్ధి చెందుతోంది అంటాడు మోడీ. మా పరిపాలన కాలంలో నిర్మాణరంగం కొత్త పుంతలు తొక్కింది అంటాడు నితిన్ గడ్కరీ.. తెలంగాణకు మేం వేల కోట్లు ఇచ్చాం తెలుసా అంటాడు కిషన్ రెడ్డి. వాళ్ల మొహాలు తెల్ల మొహాలు వేసుకునేలాగా ఆ పనులు ఆరు సంవత్సరాలుగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కెసిఆర్ ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. ఏదో తన నమస్తే తెలంగాణలో కేంద్రాన్ని విమర్శించే సమయం వచ్చినప్పుడు రాసుకుంటూ పోయాడు.
ఆ పనులు ముమ్మాటికీ తలవంపులే. ప్రజల ముందు తలవంచుకునే తార్కాణాలే. పైగా ఆ పనులను అప్పగించిన కంపెనీ దివాలా తీసింది. అయినప్పటికీ మన రాజకీయ నాయకులు ఉపేక్షించారు.. నిశ్శబ్దాన్ని ప్రదర్శించారు. చివరికి ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. రేవంత్ రెడ్డి చర్నాకోల్ అందుకుని కొట్టేసరికి ఒక్కసారిగా కదలిక వచ్చింది. అఫ్కోర్స్ రాజకీయాలు వేరు, రాజకీయ లక్ష్యాలు వేరు.. అభివృద్ధి అనే మాట వచ్చేసరికి కచ్చితంగా నాయకుడికి ఒక దిశ అంటూ ఉండాలి. ఒక దశలో సాగుతూ ఉండాలి.. గుడ్ ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అభినందించాల్సిందే. ఎటోచ్చి ఇది కిషన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఇబ్బంది కలిగించే పరిణామం. అయితే దీని వెనుక ఏముందో తెలియదు గానీ.. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది పోలవరం ప్రాజెక్టుకు తాత.. నమ్మి ఓట్లు వేసినందుకు జనం అనుభవిస్తున్న ఖర్మ.. అందుకు నిదర్శనమే ఉప్పల్ – నారపల్లి ఫ్లైఓవర్ పనులు.
ఆరు సంవత్సరాల తర్వాత..
ఉప్పల్ – నారపల్లి ప్రాంతంలో సరిగా ఆరు సంవత్సరాల క్రితం ఫ్లై ఓవర్ నిర్మించాలని భావించారు. నాడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి, ఇతర నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ పని కేంద్రం, రాష్ట్ర పరిధిలోది కాబట్టి.. కాంట్రాక్టులు కూడా ఉభయులకు అనుకూలమైన కంపెనీకి ఇచ్చేలాగా ఒప్పందాలు జరిగాయి. గాయత్రి కంపెనీ కాంట్రాక్టు పనులు దక్కించుకుంది. పనులు ప్రారంభించింది. అవి నత్త నడకను సరిపోలాయి. ఆరు సంవత్సరాల్లో 44 శాతం మాత్రమే పనులు పూర్తి చేసింది ఆ కంపెనీ.. 2018 లో 600 కోట్లతో ఈ పనులను అప్పుడు ప్రారంభించారు. పిల్లలు మాత్రమే పూర్తి చేశారు. మొత్తం 147 స్లాబులు వేయాల్సి ఉంది. ఇప్పటివరకు 37 మాత్రమే పూర్తి చేశారు. ఈ ఫ్లైఓవర్ పూర్తికాకపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ అసంపూర్తి పనులపై భారత రాష్ట్ర సమితి కేంద్రంపై యుద్ధం చేస్తున్నప్పుడు మాత్రమే ప్రస్తావించేది. ఆ తర్వాత సైలెంట్ అయిపోయేది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అప్పుడప్పుడు అలా టచ్ చేసి వదిలేది. ఒక్కరోజు కూడా ఈ పనులపై కేంద్రాన్ని అడగలేదు. నిలదీయలేదు. ఇక తెలంగాణలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు వంటి వాళ్లు ఒకరోజు కూడా దీనిపై రివ్యూ చేసింది లేదు. జనం బాధలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దివాలాలో ఉన్న గాయత్రి కంపెనీకి అధికారుల ద్వారా హెచ్చరికలు పంపించారు. పనులు ప్రారంభించక పోతే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఫలితంగా ఆ కంపెనీ దిగివచ్చింది. పనులు ప్రారంభించింద. రోడ్లు భవనాల శాఖ పరిధిలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా చేశారు. పనులు నారపల్లి ప్రాంతంలోని సిపిఆర్ఐ దగ్గర మొదలయ్యాయి. ఈ రోడ్డు మీదిగానే ట్రాఫిక్ అనుమతిస్తున్నారు. ఫ్లై ఓవర్ పనులు మొదలుపెట్టారు.. త్వరలోనే ర్యాంపు నిర్మాణం చేసి.. పిల్లర్ల పనులు కూడా చేపడుతారని తెలుస్తోంది.
దీనివల్ల ఉపయోగం ఏంటంటే
హైదరాబాద్ – యాదాద్రి ప్రాంతంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. అందువల్ల దీనిని తగ్గించడానికి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అప్పట్లో ప్రతిపాదించారు. ఆరు వర్షల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టాలని భావించారు. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు ఏకంగా 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తారు. దీనికోసం 600 కోట్లు ఖర్చు అవుతుందని నాటి రోజుల్లో అంచనా వేశారు. ప్రభుత్వం విధించిన నాటి నిబంధనల ప్రకారం 2020 జూలైలోనే దీనిని పూర్తి చేయాలి. అయితే ఈ పనులు దక్కించుకున్న కంపెనీ దివాలా తీయడంతో ఎక్కడికక్కడే నిర్మాణం ఆగిపోయింది. ఆరు సంవత్సరాలుగా పిల్లర్లు అలంకార ప్రయంగా మిగిలిపోయాయి. ఫలితంగా ఈ మార్గం మీదుగా ప్రయాణాలు సాగించే నగరవాసులు నరకం చూడడం.. వీటి గుంతల్లో పడి గాయపడడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్ల తర్వాత పనులు మొదలు కావడంతో ఈ ప్రాంత ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. అయితే పనులు డెడ్ లైన్ లోపు జరుగుతాయా.. మళ్లీ ఆగుతాయా.. అనేది తేలాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Revanth reddy government orders completion of uppal narapalli flyover
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com