2024 Round UP TS Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నెల రోజులకు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఏడాదంతా సాఫీగా సాగిపోతుందని అంతా అనుకన్నారు. రాజకీయాలు కొన్నాళ్లు సైలెంట్ అవుతాయని భావించాం. కానీ, తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ఎక్కడా తగ్గడం లేదు. అలసట లేకుండా ఎన్నికల తర్వాత కూడా అగ్రసివ్ రాజకీయాలు నడుపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో మూడు పార్టీలు దూకుడు కొనసాగించాయి. అలుపెరగని రాజకీయాలు చేశాయి. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీకి అనుకూలంగా రాగా, బీఆర్‌ఎస్‌ను తీవ్రంగా నిరాశపర్చాయి. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా పార్టీలు హైస్పీడ్ పాలిటిక్స్ కొనసాగిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ డక్ ఔట్..
లోక్సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ డక్ ఔట్ అయింది. 17 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. కాలి తుంటి ఎముక విరిగినా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని గులాబీ బాస్ కేసీఆర్ అనుకున్నారు. ఈమేరకు బస్సుయాత్ర చేశారు. అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ పసలేని విమర్శలతో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి లాభం జరుగలేదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, చక్రం తిప్పుతామని ఇలా ఎన్నెన్నో చెప్పారు. కానీ, ఎన్నికల ఫలితాలు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఒక్క సీటుకూడా గెలుచుకోలేదు. మరీ దారుణం ఏమిటంటే… సంగానికిపైగా సీట్లులో డిపాజిట్ కోల్పోయింది. ఈ పరిణామాన్ని బీఆర్‌ఎస్ అస్సలు ఊహించలేదు. ఇక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 8 స్థానాలు గెలుచుకున్నాయి. హైదరాబాద్‌లో పాగా వేయాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరలేదు. ఎంఐఎం తన ఒక్క స్థానం నిలబెట్టుకుంది. బీఆర్‌ఎస్ ఓటుబ్యాంకు దారుణంగా పడిపోయింది. ఆ ఓట్లుపూర్తిగా బీజేపీకి బదిలీ అయ్యాయి. అప్పటి నుంచి కేసీఈఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చారు. కేటీఆర్, హరీశ్ పార్టీని జోడెద్దుల్లా నడిపిస్తున్నారు. ఇటీవలే కవిత యాక్టివ్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికలు ముందు కవితను ఈడీ అరెస్టు చేసింది. దాదాపు 5 నెలలు ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమె జైల్లోనే ఉన్నారు.
బీఆర్‌ఎస్‌కే కష్టాలు..
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు 2023 చివరి నుంచి గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. 2024లో అది కంటిన్యూ అయింది. ఒక్క లోక్‌సభ సీటు గెలవలేదు. కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది. కవిత అరెస్టు తమకు కలిసి వస్తుందని గులాబీ నేతలు భావించారు. కానీ, కవితను అరెస్టు చేయడం మంచిదే అన్నట్లుగా తెలంగాణ ఓటర్లు బీఆర్‌ఎస్‌కు తీర్పునిచ్చారు. ఇక లోక్‌సభ ఎన్నికల సయంలో మొదలైన వలసలు లోక్‌సభ ఎన్నికల తర్వాత వరకు కొనసాగాయి. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు కోసం బీఆర్‌ఎస్ చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. పార్టీకి రిలీఫ్ ఏమిటంటే.. కేటీఆర్, హరీశ్‌రావు యాక్టివ్‌గా పోరాడడమే.
కాంగ్రెస్‌కు కలిసివచ్చినా అసంతృప్తే..
2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లోసంచలన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు 2024 పెద్దగా నష్టం చేకపోయినా.. చెప్పుకోదగిన లాభం కూడా చేయలేదు. పైగా అసంతృప్తి కొనసాగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో 13 గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ, కేవలం సింగిల్ డిజిట్ 8కే పరిమితమైంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన బలమైన నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. కానీ 8 స్థానాలకే పరిమితమైంది. ఇక మంత్రివర్గ విస్తరణ జరగడం లేదు. 12 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మంత్రి పదవుల కోసం వేచి చూస్తున్న వారిలో అసంతృప్తి పెరుగుతోంది. ఇక బీఆర్‌ఎస్ అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అన్నిరకాలుగా దాడిచేస్తోంది. ఇక ఇటీవలే తెలంగాణ తల్తి విగ్రహం ఆవిష్కరించారు. దీంతో ఎవరికి లబ్ధికలుగుతుందో చూడాలి.
నిదానంగా బీజేపీ…
తెలంగాణలో బీజేపీ స్లో అండ్ స్టడీ ఫార్ములాను అనుసరిస్తోంది. బండిసంజయ్ అధ్యక్షుడిగా పార్టీని పరుగులు పెట్టించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం సంజయ్‌ను తప్పించి కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. కిషన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీకి పెద్దగా ప్రయోజనాలు చేకూరలేదు. అయినా లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి భారీగా ఓట్లు వేశారు. బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి కలిసి వచ్చాయి. కేంద్ర మంత్రిగా, తెలంగాణ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించడం లేదు. సీనియర్లు, పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 స్థానాలుగ ఎలిచింది. బీజేఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విఫలమయ్యాడు. అదికూడా బీజేపీకి మైనస్‌గా మారింది. 2025లో అయినా బీజేపీ జాతకం మారుతుందో లేదో చూడాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: 2024 round up ts politics special article on telangana politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com