ఒకరినొకరు ఓడించుకోవడమే రాజకీయం. అధికారంలో ఉన్న వారే ఎదుటివారిని గెలిపిస్తారు. పాలనపై చిరాకెత్తి.. తమకు ప్రత్యామ్నాయంగా ఎవరున్నారో వారినే గెలిపించుకుంటుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అదే కోవలో పయనిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఒక ప్రభుత్వం అర్థంపర్థం లేని ఈగోలతో ప్రజల్లో ఇదేం సర్కార్ అనే భావన కల్పిస్తుండగా.. మరో ప్రభుత్వం సందర్భోచితంగా లేకుండా నాయకత్వ మార్పును ప్రజలపైకి రుద్దుతోంది. దీంతో ప్రజల్లో వచ్చే రియాక్షనేంటో అర్థం చేసుకోవడం సాధ్యం కావడం లేదు.
Also Read: కేసీఆర్ నిర్ణయం జగన్ చావుకొచ్చింది.!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పదవీ విరమణ మీద దృష్టి సారించారు. దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించి ఉంటే ఆయన ఏం చేసేవారో కానీ.. ఇప్పుడు మాత్రం తాను పదవి నుంచి దిగిపోయి తన కుమారుడు కేటీఆర్‌ను ఎప్పుడు సీఎంను చేద్దామా అన్న ఆరాటంలో ఉన్నారు. అన్ని రకాల ప్రిపరేషన్స్ పూర్తి చేసి ప్రజల్లోనూ ఇక ఖాయమే అన్న ఫీలింగ్ కల్పించడానికి కసరత్తు ప్రారంభించారు. పార్టీ నేతలతో ముందస్తు ప్రకటనలు చేయిస్తున్నారు. చివరికి కేటీఆర్ సమక్షంలోనే ప్రకటనలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజులు పోతే ఎమ్మెల్యేలు అందరూ తీర్మానాలు చేయవచ్చు. ప్రజల పేరుతో టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీలు చేయవచ్చు. చివరికి ఎమ్మెల్యేలు, ప్రజల ఒత్తిడికి తలొగ్గి కేసీఆర్.. కేటీఆర్‌ను సీఎం చేయడానికి అంగీకరించి.. ఆ మేరకు వారసుడిగా బ్యాటన్ అందించవచ్చు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తీసుకున్న సమయం మాత్రం చాలా సున్నితమైనది. ఎందుకుంటే.. తెలంగాణ సమాజంలో రాజకీయం భిన్నమైనది. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన పార్టీ. అంతమాత్రాన ప్రజలు ఆ పార్టీని ఎల్ల కాలం భుజాన మోయాలని లేదు. ముఖ్యంగా కేసీఆర్‌నే కాదు ఆ పార్టీ వారసుడినీ మోయాలని అంతకన్నా లేదు. వాస్తవానికి వారసుడు అనే సరికి ప్రజల్లో ఓ రకమైన నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ వారసుడిని తాము పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రజల్లోకి దింపాలి. వాళ్ల ఆమోద ముద్ర వేయించాలి. కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశం.. ఎమ్మెల్యేగా ఆయనకు ఆమోదముద్ర లాంటి వాటిని కేసీఆర్ సమర్థంగానే డీల్ చేశారు. కానీ సీఎం పదవి అప్పగించే సమయానికి పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్కు ఎదురుగాలి ప్రారంభమయింది. కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ప్రారంభమైన ఈ సమయంలో నాయకత్వ మార్పు జరిగితే పరిణామాలను ఊహించడం కష్టం.
Also Read: టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..: పరీక్షలు ఎప్పుడో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మరింత భిన్నం. తాను అనుకున్నదే న్యాయం అని అనుకుంటారేమో కానీ.. న్యాయనిపుణుల సలహాలు కూడా పట్టించుకోకుండా తాను చెప్పినట్లుగా చేయాలని హుకుం జారీ చేస్తారని తాజా పరిణామాలతోనే తేలిపోతోంది. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే దీనికి నిదర్శనం. హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో స్పష్టంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఊటంకించారు. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఎవరూ సుప్రీంకోర్టుకు వెళ్లి చీవాట్లు తినాలని అనుకోరు. కానీ అయిననూ పోయిరావలెనని జగన్ పిటిషన్ వేయించారు. ఒక్క విషయంలో కాదు ప్రతీ విషయంలోనూ అంతే. కొత్త వైద్యుడు కంటే పాత రోగి మేలు అన్నట్లుగా ఎన్నో కేసులతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన తనకు న్యాయపరంగా అన్నీ తెలుసని అనుకుంటున్నారేమో కానీ పూర్తిగా తన చర్యలతో చులకన అయిపోతున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం చేయరాని తప్పులే చేస్తున్నట్లుగా రాజకీయ నిపుణుల అభిప్రాయం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Telugu states cms taking wrong decisions
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com