Telangana : తెలంగాణలో హైదరాబాద్ స్థానిక సంస్థల(Hyderabad Local Body) కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం సోమవారం(మార్చి 24) విడుదల చేసింది. ఈ ఎన్నికలు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు(MS.Prabhakar Rao) పదవీ కాలం మే 1న ముగియనున్న నేపథ్యంలో ఎన్నిల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం క్రింది తేదీలు ఇలా ఉన్నాయి.
Also Read : బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం.. ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్!
మార్చి 28, 2025: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం.
ఏప్రిల్ 4, 2025: నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.
ఏప్రిల్ 7, 2025: నామినేషన్ల పరిశీలన.
ఏప్రిల్ 9, 2025: నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు.
ఏప్రిల్ 23, 2025: పోలింగ్ రోజు.
ఏప్రిల్ 25, 2025: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
ఈ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులు (కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వారు) ఓటర్లుగా పాల్గొంటారు. తెలంగాణ శాసనమండలి(Telangana Shasana mandali)లోని ఈ స్థానం కోసం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమలులోకి వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లు వీరే..
స్థానిక సంస్థల ఓటర్లు అంటే హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, వీరు శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎన్నుకునే అర్హత కలిగి ఉంటారు. వీరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కార్పొరేటర్లు(Corporetars), హైదరాబాద్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి వారు ఉంటారు. ఈ ఓటర్లు స్థానిక సంస్థల ప్రాతినిధ్యం వహిస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కలిగి ఉంటారు. ప్రస్తుతం, మార్చి 24 నాటికి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ ఎన్నిక హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా కింద జరుగుతుంది. ఓటర్ల సంఖ్య కచ్చితంగా జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు కేవలం ఎన్నికైన ప్రతినిధులు మాత్రమే. GHMC లో 150 కార్పొరేటర్ వార్డులు ఉండగా, వీరితోపాటు ఇతర స్థానిక సంస్థల నుంచి సుమారు 200–250 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సంఖ్య ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత స్పష్టమవుతుంది.
ఏప్రిల్3న పోలింగ్..
ఈ ఎన్నికల్లో ఓటింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది, మరియు ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25, 2025న ఉంటుంది. ఓటర్ల జాబితా తయారీలో భాగంగా, స్థానిక సంస్థల ప్రతినిధుల వివరాలను సేకరించి, ఎన్నికల సంఘం వారి అర్హతను ధ్రువీకరిస్తుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు.