AP Nominated Posts: ఏపీలో ( Andhra Pradesh)టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు రెండు జాబితాలను ప్రకటించారు. మూడో జాబితా ప్రకటనలో ఎడతెగని జాప్యం జరుగుతూ వస్తోంది. మధ్యలో ఎమ్మెల్సీ పదవులు, ఇతరత్రా కారణాలు చూపుతూ నామినేటెడ్ పోస్టులను ప్రకటించలేదు. ఇటీవల మీ చివరి వారంలో ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు కార్యాచరణ ప్రారంభం కాలేదు. కనీసం కసరత్తు కూడా జరగడం లేదు. దీంతో ఇప్పుడు కూడా డౌటేనని తెలుస్తోంది.
Also Read: జగన్ అడ్డాలో క్యాంపు పాలిటిక్స్.. గట్టిగానే కూటమి సవాల్!
* రోజు రోజుకు జాప్యం..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని అంతా భావించారు. కానీ అప్పుడు కూడా చాలా ఆలస్యం చేశారు. దీనికి తోడు మూడు పార్టీలకు సర్దుబాటు చేయాల్సి ఉండడంతో చాలామంది నేతలకు మొండిచేయి చూపారు. కొందరు రాష్ట్రస్థాయిలో చైర్మన్ పోస్టులు ఆశించారు. కానీ డైరెక్టర్ పదవులతో సరిపెట్టారు. మరికొందరు ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అటువంటి వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి.
* పెద్ద నేతలకు పెద్ద పదవులు..
అయితే టిడిపిలో( Telugu Desam Party) పెద్ద నేతలకు ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ స్థానాలు వంటివి దక్కాయి. మరికొందరికి భవిష్యత్తులో ఇస్తామని హామీలు కూడా ఉన్నాయి. మరికొందరు ప్రథమ శ్రేణి నాయకులకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఒక స్థాయి గల నేతల వరకు పర్వాలేదు కానీ.. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి మాత్రం ఇంతవరకు ఉపశమనం కలిగించే ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. ప్రధాన నేతల అనుచరులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. మెజారిటీ పదవులు అయిపోయాయి. కానీ ఇక ద్వితీయ శ్రేణి నేతలకు ఇవ్వాల్సిన పదవుల విషయంలో మాత్రం చాలా జాప్యం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. దీనిపైనే పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రధానంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉంచారు. వాటిపై నేతలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.
* ఆ పదవులకు ఎదురుచూపు..
మరోవైపు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు( pacs ), ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లు, ఆలయ ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, డిసిసిబి, ఆప్కాబ్ పదవులు ఇంకా ప్రకటించలేదు. ఆ మధ్యన నేతల నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. కానీ పదవుల భర్తీ విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపారు. దీంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి మాత్రం కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద నేతలకు పర్వాలేదనిపించినా.
. చిన్న నేతలకు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. మరి నామినేటెడ్ పదవుల భర్తీ అనేది ఎప్పుడు చేస్తారో ఇక చూడాలి.