Kavitha Rakhi To KTR: సరిగ్గా గత ఏడాది ఇదే సమయానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటు కవిత హస్తిన జైల్లో ఉన్నారు. ఆమెను బయటకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఈ నేపథ్యంలో సరిగ్గా గత ఎడాది ఇదే సమయానికి రాఖీ పండుగ రానే వచ్చింది. అప్పటికి కవిత ఇంకా బయటికి రాలేదు. దీంతో కలవకుండా తార రామారావుకు భారత రాష్ట్ర సమితి మహిళా నాయకురాళ్లు రాఖీలు కట్టారు. కవిత లేని లోటును తీర్చారు. తారక రామారావు రెండు చేతులు నిండిపోయే విధంగా రాఖీలు కట్టి.. హారతి కూడా పాడారు. అయితే అంత మంది రాఖీలు కట్టినప్పటికీ కల్వకుంట్ల తారకరామారావు మదిలో ఏదో వెలితి.
Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..
చివరికి అనేక ప్రయత్నాల తర్వాత కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది. బెయిల్ వచ్చిన తర్వాత కవిత ఒకరోజు గ్యాప్ అనంతరం తన సోదరుడు ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత అతడికి రాఖీ కట్టింది. సోదరి కట్టిన రాఖీని చూసుకుంటూ తారక రామారావు మురిసిపోయాడు. మొత్తానికి రాఖీ పండుగ పూర్తయిందని సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యానించాడు. సరిగ్గా ఏడాది గడిచిందో లేదో.. ఇప్పుడు కలవకుంట్ల కుటుంబంలో ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా కల్వకుంట తారక రామారావుకు కల్వకుంట్ల కవిత రాఖీ కట్టే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో అన్నా చెల్లెలు మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆమె తన తండ్రికి రాసిన లేఖలను కొంతమంది భారత రాష్ట్ర సంత నాయకులు బయటకి విడుదల చేయడంతో కవితకు ఒక్కసారిగా ఆగ్రహం పెరిగిపోయింది. ఇక అప్పటినుంచి తన తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయని.. తన తండ్రి దేవుడని.. ఆడబిడ్డ పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని.. కొంతమంది సోషల్ మీడియా బ్యాచ్ తో తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని కవిత ఆరోపిస్తున్నారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితికి దూరంగా జరిగి తన సొంత రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. జాగృతి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తన సోదరుడి జన్మదినం సందర్భంగా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేసిన కవిత.. ముక్తసరిగానే ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు ఒక స్థాయిలో ఉన్న నేపథ్యంలో.. రక్షాబంధన్ కట్టే అవకాశం లేదని.. ఎందుకంటే కవిత తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారని ఆమె అనుచరులు అంటున్నారు. ఒకవేళ మనసు మార్చుకొని కవిత రాఖీ కట్టడానికి వెళ్తే.. కేటీఆర్ కట్టించుకుంటారా.. ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుంది. ఎందుకంటే అతి త్వరలోనే రాఖీ పండుగ ఉంది కాబట్టి.