Visakhapatnam To Bhogapuram Theme Townships: విశాఖ నగరాన్ని( Visakhapatnam City) మరింతగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య కనెక్టివిటీ మరింత పెంచాలని చూస్తోంది. అందులో భాగంగా ఐదు జిల్లాలకు విస్తరిస్తూ మెట్రో రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంకోవైపు తీరం వెంబడి గ్రీన్ హైవే నిర్మాణం చేపట్టాలని చూస్తోంది. శ్రీకాకుళం జిల్లా మూలపాడు పోర్ట్ నుంచి.. భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా.. భీమిలి బీచ్ రోడ్డును కలుపుతూ.. కోస్టల్ హైవేను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇంకోవైపు విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుమధ్య కొత్తగా ప్రత్యేక థీమ్ తో టౌన్ షిప్ లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నాలుగు చోట్ల ఈ టౌన్ షిప్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి.. నిజం ఎంత?
* ప్రతిదానికి ఓ ప్రత్యేకత..
ప్రతి టౌన్ షిప్ కు( township ) ఓ ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేస్తోంది విఎంఆర్ డిఏ. ఐటీ అండ్ ఇన్నోవేషన్, హెల్త్ అండ్, నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్, టూరిజం అండ్ కల్చర్, లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్, ఎక్కువ రీ సైలెన్స్ వంటి రంగాలను ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కో టౌన్షిప్ ఒక్కో రంగానికి ప్రత్యేకించి అభివృద్ధి చేస్తారు. మాస్టర్ ప్లాన్ రూపొందించి లేఅవుట్లు వేయడమే కాకుండా ఆయా పరిశ్రమలు రావడానికి, పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన మౌలిక వసతులు సమకూరుస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
* రెండింటి పై ఫుల్ క్లారిటీ..
నాలుగు టౌన్ షిప్ లకు గాను.. భీమిలి మండలం కొత్తవలస( kothavalasa ) వద్ద ఒకటి.. ఆనందపురం మండలం శొంఠ్యం ప్రాంతంలో మరొకటి ఏర్పాటు చేసేందుకు సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. మరో రెండింటికి సంబంధించి ఎంపిక జరగనుంది. అయితే ఈ టౌన్ షిప్ లలో రెసిడెన్షియల్ కాలనీలు, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్స్, థీమ్ పార్కులు, గోల్ఫ్ కోర్సులు వంటివి వస్తాయి. అయితే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటి ఏర్పాటుకు సంబంధించి ఆర్కిటెక్టీల నుంచి ప్రత్యేక అభిప్రాయాలను కోరుతున్నారు.