HomeతెలంగాణBeer: తెలంగాణ బీరు ప్రియులకు ఇదో గుడ్ న్యూస్

Beer: తెలంగాణ బీరు ప్రియులకు ఇదో గుడ్ న్యూస్

Beer: ఏపీలో ఊరు పేరు లేని మద్య, కొత్త కొత్త బ్లాండ్ల పేరుతో బీర్లు విక్రయించారు. వీటిపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఇందతా జగన్‌ బ్రాండ్‌ మద్యం అని, మందు బాబులకు ఇష్టమైన, ఆరోగ్య కరమైన మద్యం అందుబాటులో ఉంచడం లేదని పేర్కొన్నారు. కల్తీ మద్యం విక్రయిస్తోందని విమర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే నాణ్యమైన బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెస్తామని టీడీపీ హామీ ఇవ్వడం ఆ రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లకు నిదర్శనం.

ఇప్పుడు తెలంగాణలో..
ఇక ఇప్పుడు తెలంగాణ(Telangana)లో కూడా కొత్త కొత్త బ్రాండ్ల మద్యం అందుబాటులోకి రాబోతోంది. బీరు ప్రియులకు కొత్త బ్రాండు బీర్లు కిక్‌ ఇవ్వనున్నాయి. అతి త్వరలోనే కొత్త కొత్త పేర్లతో మార్కెట్‌లోకి రానున్నా. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం సోమ్‌ డిస్టిల్లరీస్‌కు అనుమతి ఇచ్చింది.

కొత్త బ్రాండ్లు ఇవే..
సోమ్‌ డిస్టిల్లరీస్‌ నుంచి పవర్‌ 1000(Power 1000), బ్లాక్‌ ఫోర్ట్ (Black fort), హంటర్(Hunter), వుడ్‌ పీకర్‌(Wood pekar) బీర్లు తెలంగాణ మద్యం షాపుల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం కొత్త బీర్లకు అనుమతి ఇచ్చిన విషయం తెలియగానే ఆయా కంపెనీల షేర్లు కొద్ది గంటల్లోనే 7 శాతం పతనమయ్యాయి.

దొరకని డిమాండ్‌ బీర్లు..
ఇదిలా ఉంటే ఈ వేసవిలో తెలంగాణలో డిమాండ్‌ ఉన్న బీర్లు దొరకడం లేదు. స్టాక్‌ ఉండడం లేదు. దీంతో ఊరు, పేరు లేని బ్రాండ్లను వైన్స్‌ నిర్వాహకులు బీరు ప్రియులకు అంటగడుతున్నారు. దీనిపై విపక్షాలు రేవంత్‌ సర్కార్‌పై విమర్శలు చేశాయి. స్పందించిన ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణలో కొత్త మద్యం విక్రయాలకు ఎవరూ దరఖాస్తు చేయలేదని ప్రకటించారు. కానీ, నాలుగు రోజులకే సోమ్‌ డిస్టిల్లరీస్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చర్చనీయాంశమైంది.

విపక్షాల ఆగ్రహం..
రాష్ట్రంలో కొత్త మద్యం విక్రయాలపై విపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ సర్కార్‌ రాష్ట్రంలోకి కల్తీ మద్యాన్ని తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపిస్తున్నారు. కొత్తగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని మంత్రి ప్రకటించిన నాలుగు రోజులకే సోమ్‌ డిస్టిల్లరీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి జూపల్లికి తెలియకుండానే మద్యం దందాలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. బ్రాండెడ్, డిమాండ్‌ ఉన్న మద్యం అందుబాటులో ఉంచడంలో విఫలమవుతున్న రేవంత్‌ సర్కార్‌ కొత్త డిస్టిల్లరీలకు మాత్రం అనుమతి ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular