Telangana: ముందుమాట పేజీ చింపేస్తున్నారు.. ఉపాధ్యాయులకే ఆ బాధ్యతలు!

మిగతా పుస్తకాల్లో ఉన్న ముందుమాట పేజీని చింపివేయాలని విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. దీంతో డీఈవోలు ఆ బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించారు.

Written By: Raj Shekar, Updated On : June 15, 2024 4:03 pm

Telangana

Follow us on

Telangana: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేసిన ఉచిత పాఠ్య పుస్తకాల్లో తెలుగు పుస్తకాల్లోని ముందుమాట ఇప్పుడు ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లు అచ్చయ్యాయి. ఆలస్యంగా పొరపాటును గుర్తించిన అధికారు ప్రభుత్వ సూచనతో సుమారు 24 లక్షల పుస్తకాలను వెనక్కి తీసుకున్నారు.

మిగిలిన పుస్తకాల్లో పేజీ తొలగింపు..
ఇక మిగతా పుస్తకాల్లో ఉన్న ముందుమాట పేజీని చింపివేయాలని విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. దీంతో డీఈవోలు ఆ బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు కొత్త పుస్తకాల్లోని ముందుమాట పేజీని చింపేస్తున్నారు.

చదవులు పక్కన పెట్టి..
ఇక ఉపాధ్యాయులు రెండు రోజులుగా విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేశారు. తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీ తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఉన్నత పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా పేజీలు తొలగించే పనే చేస్తున్నారు ఉపాధ్యాయులు.

అధికారులపై వేటు..
ఇదిలా ఉంటే.. పొరపాటుకు బాధ్యలను చేస్తూ.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ రాధారెడ్డిని సస్పెండ్‌ చేసింది. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇక ఎస్‌సీఈఆర్టీ పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ రమేశ్‌కు బాధ్యలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి రమణకుమార్‌కు ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా నియమించింది.