Telangana Goverment
Telangana : తెలంగాణలో బీఆర్‌ఎస్(BRS) సుమారు పదేళ్లు అధికారంలో ఉంది. అప్పులు, సప్పులు చేసి ప్రజలకు కనిపించేలా అభివృద్ధి చేసింది. అయితే ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం వహించడం, ఆ పార్టీ నేతల అరాచకాలు పెరిగిపోవడంతో 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్(Congress)ను ఆదరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరు గ్యారంటీ హామీలతోపాటు 420 హామీలు ఇచ్చారు. ఇవి కూడా ప్రజలను ఆకర్షించాయి. అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన నేతలు, ఇప్పుడు ఏడాది దాటినా మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ మినహా మరే హామీలు అమలుకావడం లేదు. ఇందుకు కారణం కూడా ఉంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. దీంతో హామీల అమలుకు రేవంత్‌రెడ్డి సర్కార్ వెనకాముందు ఆలోచిస్తోంది. దీంతో విపక్షాలు ఎన్నికల హామీలపై నిలదీస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ సర్కార్ నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. నిధులు ఉంటే పథకాలు అమలు చేయవచ్చన్న ఆలోచనతో కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిభౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని నిర్ణయించింది. ఈ భూమి హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి గ్రామంలో సర్వే నంబర్ 25(P) పరిధిలో ఉంది. ఇది సైబరాబాద్‌లోని ఒక ప్రధాన వాణిజ్య మరియు ఐటీ కేంద్రంలో భాగం. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ఈ వేలం ప్రక్రియను నిర్వహిస్తోంది, దీని ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సుస్థిర మాస్టర్ ప్లాన్ లేఅవుట్‌ను రూపొందించి, దశలవారీగా భూమిని విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : తెలంగాణ జీడీపీలో ఆ మూడు జిల్లాలే టాప్.. ఏ జిల్లా ఏ స్థానంలో ఉందంటే?
రూ.30 వేల కోట్ల సమీకరణ
భూముల వేలం ద్వారా సుమారు 30,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులను హామీలు నెరవేర్చడంతోపాటు కొత్త పథకాలు ప్రారంభించేందుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల(Devalopment Programmes) కోసం ఉపయోగించనున్నారు. ఈ భూములు గతంలో IMG భారత్‌కు సంబంధించినవిగా చెప్పబడుతున్నాయి. ప్రస్తుతం, ఈ ప్రాజెక్టు కోసం కన్సల్టెంట్‌లను ఎంపిక చేసేందుకు బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గచ్చిబౌలి(Gachibouli)హైదరాబాద్‌లోని ఒక కీలక ప్రాంతం, ఇక్కడ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు సమీపంలో ఉండటం వల్ల ఈ భూమికి గణనీయమైన విలువ ఉంది. ఈ చర్యపై కొందరు ఆర్థిక వనరుల సమీకరణకు మంచి అవకాశంగా చూస్తుండగా, మరికొందరు భవిష్యత్ పరిశ్రమల కోసం భూమిని కాపాడాలని వాదిస్తున్నారు.
ఎకరం రూ.50 కోట్లకుపైనే..
గచ్చిబౌలి హైదరాబాద్‌లోని ఒక ప్రధాన ఐటీ మరియు వాణిజ్య కేంద్రంగా ఉండటం వల్ల భూమి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా, గచ్చిబౌలిలో వాణిజ్య ప్రాంతాల్లో ఎకరం ధర 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. నివాస ప్రాంతాల్లో ఈ ధర కొంత తక్కువగా, అంటే ఎకరానికి రూ.30 కోట్ల నుండి రూ.60 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని నిర్ణయించింది, వేలంలో ఈ ధర మార్కెట్ డిమాండ్ ఆధారంగా నిర్ణయించే అవకాశం ఉంది. ఈనెల 7న ప్రీబిడ్డింగ్(Pree bidding)నిర్వహిస్తుంది. ఈనెల 15 వరకు బిడ్డింగ్‌కు గడువు ఇస్తుంది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 0.003 శాతం టీజీఐఐసీకి వాటాగా ఇవ్వనుంది.
Also Read :ఈ డివైజ్ తో వాహనం ఎక్కడున్నా తెలిసిపోతుంది..
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Telangana the telangana government is planning to use the revenue of about rs 30000 crore from land auctions to launch new schemes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com