Bigg Boss Telugu 9
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సన్నాహాలు మొదలవుతున్నాయనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. గత సీజన్ కంటే ముందే లేటెస్ట్ సీజన్ ప్రసారం కానుందట. ఈ క్రమంలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందట. కాగా సీజన్ 9లో ఈ ఆరుగురు సెలెబ్స్ కంటెస్ట్ చేయడం ఖాయమంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.
బిగ్ బాస్ అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన రియాలిటీ షో. 2017లో తెలుగులో ప్రయోగాత్మకంగా మొదలైంది. ఫస్ట్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఇక సీజన్ 2కి నాని ని రంగంలోకి దించారు. ఎన్టీఆర్, నాని వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. గత ఆరు సీజన్స్ గా నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తున్నారు. సీజన్ 8 పర్లేదు అనిపించింది. ఓ మోస్తరు ఆదరణ రాబట్టింది. సీజన్ 7 స్థాయిలో మెప్పించలేదని చెప్పాలి.
కాబట్టి సీజన్ 9 సరికొత్తగా సిద్ధం చేయాలని భావిస్తున్నారు. అనుకున్న సమయం కంటే ముందే బిగ్ బాస్ షో ప్రసారం కానుందట. కాగా బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ ఆరుగురు సెలెబ్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. వారు హౌస్లోకి వెళ్లొచ్చు అనడానికి, కొన్ని కారణాలు ఉన్నాయి. తాజాగా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 ప్రోమో విడుదలైంది. అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించనున్న ఈ షోలో శ్రీముఖి యాంకర్. సీజన్ 1 సక్సెస్ కావడంతో సీజన్ 2 చేస్తున్నారు.
ప్రోమోలో కంటెస్టెంట్స్ గా పలువురు బుల్లితెర స్టార్స్ ని పరిచయం చేశారు. వీరిలో కొందరు ఆల్రెడీ బిగ్ బాస్ షోలో పాల్గొన్నవారు ఉన్నారు. ఈసారి మాజీ కంటెస్టెంట్స్ కి ఛాన్స్ ఉండదని సమాచారం. ఆ విధంగా ఫిల్టర్ చేస్తే జబర్దస్త్ ఇమ్మానియేల్, జబర్దస్త్ ఐశ్యర్య, ఉమ్మడి కుటుంబం సీరియల్ ఫేమ్ అనాల సుష్మిత, మల్లి సీరియల్ హీరోయిన్ భావన లాస్య, యాంకర్ నిఖిల్, బంచిక్ బబ్లు షోలో పాల్గొనే అవకాశం ఉంది. గత సీజన్లో బంచిక్ బబ్లు పాల్గొంటున్నాడని గట్టిగా వినిపించింది. కానీ అతడు షోకి రాలేదు. సీజన్ 9లో గ్యారంటీగా కంటెస్ట్ చేస్తాడని అంటున్నారు. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2లో ఈ ఆరుగురు కంటెస్టెంట్ చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
మరోవైపు ఈసారి నాగార్జున హోస్టింగ్ బాధ్యత నుండి తప్పుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఆయన చేయకుండా నెక్స్ట్ ఆప్షన్ ఎవరో చూడాలి. నాగార్జున కాకుంటే రానా బెస్ట్ చాయిస్ అంటున్నారు.
Also Read: దేశం కోసం ప్రాణత్యాగం..హీరోయిన్ మీనాక్షి చౌదరి తండ్రి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!
Web Title: Bigg boss telugu 9 confirmed first 6 contestants
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com