https://oktelugu.com/

CM Revanth Reddy : పెద్దాయన కేసీఆర్ ను ఖతం చేయాలని చూస్తున్నరు.. సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున పలు అంశాలపై వాడీ వేడి చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Written By: , Updated On : March 27, 2025 / 06:25 PM IST
CM Revanth Reddy

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది. రేవంత్‌ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ (కేటీ రామారావు) హరీష్‌ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను పడగొట్టి.. తాము సీఎం కావాలని, కేటీఆర్, హరీశ్‌రావు తీవ్రంగా ప్రనయత్నం చేస్తున్నారన్నారు. ఇక కవిత కూడా మరోవైపు ప్రయత్నాల్లో ఉందని వెల్లడించారు. ఈ విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని తెలిపారు. అయితే కేటీఆర్‌ కల నెరవేరదని స్పష్టం చేశారు. గతంలో కేటీ ఆర్‌ను ప్రమోట్‌ చేసేందుకు నాటి మంత్రులు భజన చేశారన్నారు. కానీ, అది సాధ్యం కాదని ఈపు చింతపడు అవుతందని చెప్పానన్నారు. తాను చెప్పినట్లుగానే కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి.. కాబోయే సీఎం అని ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ 2028లో కూడా తాము అధికారంలోకి వస్తామని, కేసీఆర్‌ను ఖతం చేసి తాము ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని ఆరోపించారు.

Also Read : జైల్లో 16 రోజులు నరకం .. రేవంత్ ను కేసీఆర్ ఇంత టార్చర్ పెట్టాడా?

వాళ్ల కలలు నెరవేరవు..
సీఎం పదవి కోసం బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత పోటీ పడుతున్నారని తెలిపారు. అయితే పెద్దాయన కేసీఆర్‌ మాత్రం ఆ సీటు వదులుకునే పరిస్థితిలో లేరన్నారు. తాను కేసీఆర్‌ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండాలని, ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

పోలీసులకు ఆదేశాలివ్వాలి..
కేసీఆర్‌కు ఆ పార్టీకి చెందిన కేటీఆర్, హరీశ్‌రావు, కవిత నుంచి ప్రాణహాని ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులకు కీలక సూచనలు చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు. కేసీఆర్‌ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.