https://oktelugu.com/

Nayak Re Release : ‘నాయక్’ రీ రిలీజ్ కి డిజాస్టర్ రెస్పాన్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Nayak Re Release: ఇన్ స్టాగ్రామ్ లో యూత్ ఆడియన్స్ ప్రోత్సహించే కంటెంట్ కి రీ రిలీజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ రావడం వంటివి ఈమధ్య కాలంలో మనం చాలానే చూసాము. అలా ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. షెడ్యూల్ చేసిన షోస్ చాలా తక్కువ, కానీ అవి కూడా హౌస్ అవ్వలేదు.

Written By: , Updated On : March 27, 2025 / 08:38 PM IST
Nayak Re Release

Nayak Re Release

Follow us on

Nayak Re Release : నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘నాయక్’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేసారు. ‘ఆరెంజ్'(Orange Movie) సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా, నాయక్ చిత్రానికి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని అందరూ ఆశించారు. ఎందుకంటే ‘నాయక్'(Nayak4K) చిత్రం లోని ‘హే..నాయక్’ అనే పాట ఇన్ స్టాగ్రామ్ లో ఈమధ్య బాగా ట్రెండ్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో యూత్ ఆడియన్స్ ప్రోత్సహించే కంటెంట్ కి రీ రిలీజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ రావడం వంటివి ఈమధ్య కాలంలో మనం చాలానే చూసాము. అలా ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. షెడ్యూల్ చేసిన షోస్ చాలా తక్కువ, కానీ అవి కూడా హౌస్ అవ్వలేదు.

Also Read : రామ్ చరణ్ పుట్టినరోజు ని పట్టించుకోని అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

రీ రిలీజ్ చిత్రాలు ఎక్కడ హౌస్ ఫుల్ అయినా, అవ్వకపోయినా, హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కచ్చితంగా హౌస్ ఫుల్స్ అవుతాయి. ముఖ్యంగా సంధ్య కాంప్లెక్స్ మెగా ఫ్యామిలీ హీరోలకు కంచుకోట లాంటిది. అక్కడ కూడా ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ నమోదు అవ్వకపోవడం గమనార్హం. మామూలు సందర్భాల్లో హౌస్ ఫుల్స్ అవ్వకపోయిన ఎదో ఒక కారణం చెప్పుకోవచ్చు కానీ, పుట్టినరోజు నాడు హౌస్ ఫుల్స్ అవ్వకపోవడాన్ని ఎలా చూడాలి. ఈ సినిమాకు ఎంత తక్కువ వసూళ్లు వచ్చాయో ఒక ఉదాహరణ చెప్తాను. అక్కినేని నాగార్జున నటించిన ‘మాస్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాలలో దీనికే అత్యంత తక్కువ గ్రాస్ వచ్చింది. కానీ నాయక్ సినిమాకు దానికంటే తక్కువ వసూళ్లు రావడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఎందుకు మెగా అభిమానులు ఈ సినిమాని పట్టించుకోలేదు..?, రీ రిలీజ్ చేసేంత గొప్ప చిత్రం కాదని అనుకుంటున్నారా..?, లేకపోతే ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ ప్రభావం కారణంగా అందరూ ఇంకా నిరాశలోనే ఉండడం వల్ల నాయక్ ని పట్టించుకోలేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానులు కూడా సోషల్ మీడియా లో ఎందుకో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. ఎక్కడా కూడా ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు ఎలాంటి హంగామా చేయలేదు. దీంతో ఈ చిత్రానికి కేవలం 18 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం రెండు సార్లు రీ రిలీజ్ అయ్యి బంపర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. మొదటి రీ రిలీజ్ సమయంలో 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే, రెండవ సారి కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ‘ఆరెంజ్’ చిత్రానికి అభిమానులు రీసెంట్ గానే ఖర్చు చేసారు కాబట్టి నాయక్ ని తేలికగా తీసుకున్నారని అంటున్నారు విశ్లేషకులు.

Also Read : ప్రొమోషన్స్ కోసం వెన్నెల కిషోర్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?