Ram Charan : అల్లు అరవింద్(Allu Aravind), చిరంజీవి(Megastar Chiranjeevi) మధ్య ఇప్పటికీ మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), రామ్ చరణ్(Global Star Ram Charan) మధ్య మాత్రం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో విబేధాలు ఉన్నాయి అనేది అనేక సందర్భాలను బట్టి అర్థం అవుతూ ఉంది. ఈ గ్యాప్ ఒకప్పుడు చిన్నదిగా ఉండేది, ఇప్పుడు పెరిగి పెద్దదై ఎక్కడికో వెళ్ళిపోయింది. రామ్ చరణ్ గత ఏడాది అల్లు అర్జున్ కి పుట్టినరోజు నాడు ఇన్ స్టాగ్రామ్ లో చాలా గొప్పగా శుభాకాంక్షలు తెలియచేశాడు కానీ, ట్విట్టర్ లో మాత్రం కేవలం ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ సాధారణంగా విష్ చేశాడు. అదే విధంగా నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అల్లు అర్జున్ ని ట్యాగ్ చేసి రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్తే, కేవలం ‘థాంక్స్’ అని చెప్తూ సాధారణంగా రిప్లై ఇచ్చాడు. ఇలా మొక్కుబడి శుభాకాంక్షలు, రిప్లైలు ఇచ్చినప్పుడే అందరికీ అర్థమైంది, వీళ్లిద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం లేదు అని.
Also Read : నిరాశపరుస్తున్న ‘సికిందర్’ అడ్వాన్స్ బుకింగ్స్..సల్మాన్ ఖాన్ కు ఏమైంది?
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం కి వెళ్తే, అదే రోజున అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ పార్టీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి కోసం వెళ్ళాడు. అప్పటి నుండి అభిమానులకు కూడా స్పష్టమైపోయింది, ఏమి జరుగుతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, చిరంజీవి, నాగ బాబు వంటి వారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు, ఆ తర్వాత అల్లు అర్జున్ కృతజ్ఞతగా వాళ్ళిద్దరి ఇంటికి వెళ్ళాడు. చిరంజీవి, రామ్ చరణ్ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ అల్లు అర్జున్ ని కలవడానికి రామ్ చరణ్ ఇష్టపడలేదు. అదే రోజు రాత్రి రామ్ చరణ్ బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే కి వెళ్ళాడు. ఇది అభిమానులకు మరో సంకేతం లాగా వెళ్ళింది. ఇదంతా పక్కన పెడితే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఇలా అందరూ శుభాకాంక్షలు తెలియజేసారు.
కానీ అల్లు అర్జున్ వైపు నుండి మాత్రం ఎలాంటి శుభాకాంక్షలు రాలేదు. ట్విట్టర్ లో కాకపోయినా కనీసం ఇంస్టాగ్రామ్ స్టోరీ లో అయినా పెడుతాడు అనుకుంటే అది కూడా చేయలేదు. అల్లు అర్జున్ ఇప్పుడే కాదు, గతంలో కూడా రామ్ చరణ్ పుట్టినరోజు కి విష్ చేసేవాడు కాదు, కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం విష్ చేసేవాడు. ఇన్ స్టాగ్రామ్ లో రామ్ చరణ్ ని ఫాలో అయ్యేవాడు కాదు, కానీ రామ్ చరణ్ మాత్రం అప్పట్లో ఫాలో అయ్యేవాడు. అయితే అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థికి సపోర్టు చేసినప్పటి నుండి అతన్ని ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో అయ్యాడు రామ్ చరణ్. ఇలా వీళ్ళ మధ్య వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే రోజురోజుకు గ్యాప్ పెరుగుతూ పోతుందని స్పష్టంగా అర్థం అవుతుంది.
Also Read : ఆ ఒక్కటి మార్చుకుంటే రామ్ చరణ్ కి తిరుగే లేదు!