spot_img
Homeటాప్ స్టోరీస్Telangana Municipal Elections 2026: అదీ తెలంగాణ ప్రజలంటే.. మున్సిపోల్స్ లో ఆ పార్టీలకు షాకింగ్...

Telangana Municipal Elections 2026: అదీ తెలంగాణ ప్రజలంటే.. మున్సిపోల్స్ లో ఆ పార్టీలకు షాకింగ్ ఫలితాలు..

Telangana Municipal Elections 2026: తెలంగాణ ప్రజలు నమ్మితే జై కొడతారు. నచ్చకపోతే పాతాళంలో పడేస్తారు. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరోసారి రుజువు కాబోతోంది.

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికలను అని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విస్తృతంగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే బిజెపి వరకు అన్ని పార్టీలు కీలక నేతలను రంగంలోకి దింపాయి. అర్ధ బలాన్ని, అంగ బలాన్ని నాయకులు ఉపయోగించారు. ఓటర్లకు ఎన్ని రకాలుగా తాయిళాలు ఇవ్వాలో.. అన్ని రకాలుగా ఇచ్చేశారు.. ఇక ఇప్పుడు కీలకమైన ఎన్నికలు బుధవారం నుంచి జరగబోతున్నాయి.. అయితే ఇదే సమయంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి.

ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ పోరులో అధికార పార్టీకి ఏకపక్షంగా ఫలితాలు వచ్చే అవకాశం కల్పించడం లేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ ఏకపక్షంగా సీట్లు రావు అని తెలుస్తోంది. మొత్తం 116 మున్సిపాలిటీలలో అధికార కాంగ్రెస్ పార్టీ 84 స్థానాలను గెలుచుకుంటుందని తెలుస్తోంది. ప్రతిపక్ష బి ఆర్ ఎస్ 26 స్థానాలను సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. బిజెపి 5.. ఎంఐ ఒక స్థానం దక్కించుకుంటుందని సమాచారం.

జిల్లాల వారీగా చూస్తే

మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ విక్టరీ లభించడం లేదు. మిగతా తొమ్మిది జిల్లాలో మాత్రం కాంగ్రెస్ తన జోరు చూపించనుంది. మెదక్ జిల్లాలో గులాబీ పార్టీ అత్యధిక స్థానాలను గెలిచే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. గులాబీ పార్టీకి రెండు.. బిజెపికి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో కూడా అధికార పార్టీ దుమ్ము రేపే అవకాశం ఉంది. ఇక్కడ ఏడు మున్సిపాలిటీలు ఉంటే.. అందులో ఆరింట్లో కాంగ్రెస్ పార్టీ.. ఒక స్థానంలో గులాబీ పార్టీ సత్తా చూపించానున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం పది మున్సిపాలిటీలు ఉండగా.. ఇందులో ఆరు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ.. గులాబీ పార్టీ మూడు స్థానాలలో.. ఎంఐఎం ఒక స్థానంలో సత్తా చూపించే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉంటే.. అన్నింటినీ గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 18 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 11.. బిజెపి నాలుగు.. గులాబీ పార్టీ మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మునిసిపాలిటీలు ఉంటే.. అందులో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి 8.. గులాబీ పార్టీకి నాలుగు స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉంటే ఇందులో 11 గులాబీ పార్టీకి.. 8 కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలో ఉండగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 11.. గులాబీ పార్టీకి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

సర్వేలో వచ్చిన ఫలితాలు నూటికి నూరు శాతం నిజం కావాలని లేదు. అలాగని తప్పు అనడానికి కూడా లేదు. కాకపోతే తెలంగాణ ప్రజలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. అధికార పార్టీ అని ఏకపక్షంగా జై కొట్టడం లేదు. ప్రతిపక్ష పార్టీని గుడ్డిగా నమ్మడం లేదు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా దూరం పెట్టడం లేదు. మొత్తంగా తెలంగాణ ప్రజలు తమ విజ్ఞతను పరిశీలిస్తున్నారు. పట్టణ ఓటర్లు అత్యంత తెలివిగా ప్రవర్తిస్తూ.. తనకు ఎవరైతే నాయకులుగా ఉంటే మంచి జరుగుతుందని భావిస్తున్నారో.. వారినే ఎన్నుకుంటున్నారు. ఈ ఫలితాలు అధికార పార్టీకి ఒక రకమైన షాక్ లాగా.. ప్రతిపక్ష పార్టీకి గుణపాఠం లాగా ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version