Homeబిజినెస్Redmi Pad 2 Pro: అదిరిపోయే redmi ఫోను... భారీ తగ్గింపు

Redmi Pad 2 Pro: అదిరిపోయే redmi ఫోను… భారీ తగ్గింపు

Redmi Pad 2 Pro: ప్రస్తుత కాలంలో చాలామంది సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు. వీరికి లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మొబైల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని అవసరాల కోసం మొబైల్ స్థానంలో కొందరు Pad కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా Pad లు పరిచయం చేస్తుంటాయి. వీటిలో Xiaomi కంపెనీ కొత్తగా టాబ్లెట్ ను విడుదల చేసింది. దీనిని ఫోన్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన ఫీచర్లతో పాటు.. రోజువారి వినియోగదారులకు సౌకర్యంగా ఉండే సాఫ్ట్వేర్ ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.

భారతదేశంలో ఇటీవల Xiaomi కంపెనీకి చెందిన Redmi Pad 2 Pro అనే టాబ్లెట్ ను రిలీజ్ చేసేది. ఇందులో ఉండే సాఫ్ట్వేర్ వేగంగా పనిచేయడానికి 8 GB Ram, 126 స్టోరేజ్ ఉంది. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ 7 S Gen 4 ప్లాట్ ఫామ్ పై ఉండటంతో మొబైల్ సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేస్తుంది. గేమింగ్ కోరుకునే వారితో పాటు ఒకేసారి పది రకాల యాప్స్ ఉపయోగించే వారికి ఇది బాగా సరిపోతుంది. టాబ్లెట్ లో 12.1 అంగుళాల LCD డిస్ప్లేను అమర్చారు. ఇది అత్యధిక రిజర్వేషన్ తో కనిపిస్తుంది. ఇందులో నెట్ఫ్లిక్స్ వంటి సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మొబైల్ కు కెమెరా నాణ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే ఈ టాబ్లెట్ లో 8 MP మెయిన్ కెమెరా ఉండడంతోపాటు.. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం అంతే మెగాపిక్సల్ తో కెమెరా పనిచేయనుంది. వీడియో రికార్డింగ్ అత్యధిక రిజల్యూషన్ తో చిత్రీకరించవచ్చు. అలాగే ఇందులో ఉండే సాఫ్ట్వేర్ వినియోగదారులకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ డాల్ఫి అట్మోస్, హై రేస్ ఆడియోకు మద్దతుగా ఉంటుంది.

ఈ మొబైల్లో 12,000 mAh బ్యాటరీ ని కలిగి ఉంది. ఇది 33 Wired చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. అలాగే 27 W రివర్స్ చార్జింగ్ కూడా కనెక్ట్ అవుతుంది. ఈ మొబైల్లో బ్లూటూత్ 5.4, USB C పోర్ట్ నువ్వు చేర్చారు. ప్రస్తుతం ఇది మార్కెట్లో రూ.27,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు కార్డుల పై రూ.2000 ప్లాట్ డిస్కౌంట్ తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈఎంఐ ద్వారా తీసుకుంటే ఆరు నెలల వరకు నో కాస్ట్ EMI వర్తించనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version