Free buffaloes Telangana government : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా బస్సు పథకం అమలు చేసిన దగ్గర నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ, అలాగే రైతులకు రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు పలు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది. రైతు భరోసా పథకంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ ఆదుకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద లబ్ధి పొందుతున్న వారికి త్వరలో 4 ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో ఉన్న పాడి రైతులకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ తెలిపింది. పాడి రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఇందిరా డైరీ పథకం అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
Also Read : తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొన్ని కీలక విషయాలు తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరా డైరీ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రెండు గేదెలు ఫ్రీగా ఇస్తున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాడి రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇందిరా డైరీ పథకం కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి లబ్ధిదారుడికి కూడా రెండు గేదెలు ఫ్రీగా లభిస్తాయి అని తెలిపారు. వివిధ శాఖల అధికారులతో దీనికి సంబంధించి మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ పథకం అమలు చేయడంపై అధికారులతో చర్చించారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరా డైరీ పథకానికి ఎటువంటి నగదు చెల్లించకుండానే వారికి ఫ్రీగా రెండు గేదలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించిన కొన్ని విధి విధానాలను కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే ఇందిరా డైరీ పథకం వర్తించాలి అంటే వాళ్లకు భూమి ఉండాల్సిన నిబంధన కూడా లేదని స్పష్టంగా తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలో గేదలు లేని వారికి ముఖ్యంగా ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు తెలిపారు.