Driving Lisence: డ్రైవింగ్ లైసెన్సు(Driving Lisence)ల జారీలో దేశ వ్యాప్తంగా అక్రమాలు జరుగుతున్నాయి. రోడ్డు నిబంధనలు తెలియనివారు, వాహనాలు నవడపడం రానివారు కూడా డ్రైవింగ్ లైసెన్సులను అడ్డదారిలో పొందుతున్నారు. ఇక రవాణా అధికారులు కూడా అక్రమాలకు మరిగి ఇష్టానుసారంగా ఎలాంటి డ్రైవింగ్ టెస్టు(Drivint Test) నిర్వహించకుండానే లైసెన్స్ జారీ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాలు జరుగడంతోపాటు అనేక మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేంకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లైసెన్స్‌ల జారీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని నిర్ణయించింది. అందుకు రాష్ట్రంలో తొలి దశలో 21 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను నిర్మించాలని నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వచ్చాక డ్రైవింగ్ లైసెన్స్ జారీలో మనవ ప్రమేయం ఉండదు. పరీక్షకు హాజరైన వ్యక్తికి లైసెన్స్ ఇవ్వాలా, వద్దా అన్నది సాఫ్ట్‌వేర్ నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం మాన్యువల్‌గా..
ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మాన్యువల్‌గా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఇందులో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లదే కీలక పాత్ర. ఇకపై వారి అవసరం ఉండదు. టెక్నాలజీ సాయంతో డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తారు. అందుకు అనుగుణంగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్(Automated Driving Taack)లను సిద్ధం చేస్తున్నారు. టెస్టుకు వచ్చే వాహనదారులు డ్రైవింగ్‌ను పరిశీలించడానికి ట్రాక్ కెమెరాలు బిగిస్తారు. నిర్ణీత సమయంలో పరీక్ష పూర్తయిందా.. రెడ్ సిగ్నల్ దగ్గర ఆగారా.. దాటేసి వెళ్లారా.. ఇలా ప్రతీ అంశం చిత్రీకరిస్తాయి. ట్రాక్‌లో వాహనం సరిగా నడిపారా లేదా అనేది కూడా టెక్నాలజీ ఆధారంగా పక్కాగా నమోదు చేస్తారు. డ్రైవింగ్ టెస్టకు దరఖాస్తుదారే హాజరయ్యాడా ఇతరులు వచ్చారా అన్న అంశాన్ని కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా గుర్తిస్తారు.
త్వరలో ట్రాక్‌ల నిర్మాణం..
రాష్ట్రంలో తొలిదశలో ఆదిలాబాద్, నిర్మాల్, నిజాబాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రాలతోపాటు కొండాపూర్, మేడ్‌చల్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, పరిగి, మలక్‌పేట్, నాగోల్, జహీరాబాద్, పెబ్బేరులో ఆటోమేటెడ్ ట్రాక్‌లు నిర్మిస్తారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)ఇటీవల ఆ ఆశాఖ ప్రత్యేక ప్రధానార్యదర్శి వికాస్‌రాజ్, అధికారులతో నిర్వహించి సమీక్షలో చర్చించారు. వాటితో వచ్చే ఫలితాలను సమీక్షించుకుని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నట్లు సమాచారం. ఇక ఒక్కో ట్రాక్ నిర్మాణానికి 3 నుంచి 4 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. భూసేకరణ తర్వాత టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే..
ఆటోమేటెడ్ ట్రాక్‌లు ఇప్పటికే దేశంలోని ఢిల్లీ, ఒడిశా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆధునిక విధానంతో టూ, త్రీ, ఫోర్ వీలర్ సహా హెవీ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఏడాదిలో తెలంగాణ(Telangana)లో కూడా ఆధునిక టెక్నాలజీతో డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తారు.
ఈ ఆటోమేటెడ్ ట్రాక్ వ్యవస్థలు దిగువ అంశాలతో ఉంటుంది:
1. సెన్సర్లను ఉపయోగించి ట్రాక్ గుర్తింపు: ట్రాక్ పరిధిలోని వివిధ మార్గాలను, సంక్లిష్టతలను సెన్సర్లు ఆధారంగా గుర్తించి, డ్రైవింగ్ భద్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
2. సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ వాడకం: ట్రాక్ వ్యవస్థ పర్యవేక్షణ కోసం కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్‌వేర్ వాడుతుంది. ఈ సిస్టమ్ డ్రైవర్ యొక్క రియల్‌టైం పనితీరు మరియు ప్రమాదాల నుంచి నివారించడానికి టెక్నాలజీని ఉపయోగిస్తుంది.
3. వేగం, మూలాలు, మరియు మార్గం పరీక్ష: డ్రైవర్ గమనిస్తే ఏవైనా పొరపాట్లు జరగడం, వేగ పరిమితి అతి సాధనాలపై ప్రయోగాలు నిర్వహించడం తదితర అంశాలపై దష్టి పెడుతుంది.
4. మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ ప్రదర్శనల మధ్య తేడా: కొంతవరకు ఆటోమేటెడ్ ట్రాక్‌లు మనుష్యుల పనితీరు, శక్తిని పర్యవేక్షించడంలో ఉపయోగపడతాయి. అలాగే, సాఫ్ట్‌వేర్‌కు ఆధారంగా ఆటోమేటెడ్ గమనాలు కూడా ఉంటాయి.
ప్రధాన ప్రయోజనాలు:
అనుభవం లేకుండా ట్రైనింగ్: కస్టమర్ లేదా డ్రైవర్ ట్రైన్ చేసేటప్పుడు, సహాయపు మరియు ప్రమాదాల నుండి మానవ తప్పిదాలను తగ్గించడానికి ఆటోమేటెడ్ ట్రాక్‌లు ఉపయోగిస్తాయి.
సంక్లిష్ట మార్గాలు: ఆటోమేటెడ్ ట్రాక్‌లు వివిధ రకాల రోడ్డు పరిస్థితులను అనుకరిస్తూ డ్రైవర్‌కు సరైన మార్గాలను చూపిస్తాయి.
ఈ విధంగా ఆటోమేటెడ్ ట్రాక్‌లు డ్రైవింగ్ పరీక్షలు లేదా ట్రైనింగ్‌లో అత్యంత ఉపయోగకరమైన సాధనంగా మారాయి.