Telangana Rythu Runa Mafi: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్‌ను మరిపించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఆరు గ్యారంటీ హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో హామీలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ అందిస్తున్నారు. తాజాగా పంట రుణమాఫీకి సిద్ధమయ్యారు. గురువారం(జూలై 18న) సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈమేరకు రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
కటాఫ్ డేట్‌కు నెల ముందే..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రుణమాఫీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ. వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌లో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఇటీవలి పార్లమెంటు ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. చెప్పినట్లుగానే.. భూములు అమ్మకుండా,, ఆస్తులు తాకట్టు పెట్టకుండా.. చెప్పిన కటాఫ్ డేట్‌కు ముందే రుణాఫీకి శ్రీకారం చుట్టి మాస్టర్‌స్ట్రోక్ ఇవ్వబోతున్నారు. రూ. లక్ష వరకూ రుణమాఫీ చేయడానికి అవసరమైన నిధులు లభించడంతో గురువారమే ఖాతాల్లో జమ చేయనున్నారు.
అన్ని సమస్యలకు ఒక్కటే మందు..
ఇటీవల రేవంత్‌రెడ్డి పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో అటు బీఆర్‌ఎస్.. ఇటు బీజేపీ వరుసగా విమర్శలు చేస్తున్నాయి. ఇంకోవైపు డీఎస్సీ, గ్రూప్–2, 3 వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు, అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఇక రేవంత్ నిర్ణయంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళనలను చాలా పెద్దవి చేసి చూపించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వంపై క్రమంగా అసంతృప్తి పెరుగుతోందన్న భావన ప్రజల్లో తెచ్చేలా కృషి చేస్తున్నారు. ఈ తరుణంగా అన్ని సమస్యలకు ఒక్కటే మందులా రేవంత్ రుణమాఫీ ప్రకటించారు.
రైతు వేదికల్లో సంబురాలు..
గురువారం(జూలై 18న) రుణమాఫీ నేపథ్యంలో పండుగ వాతావరణంలో సంబురాలు నిర్వహించాలని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈమేరకు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు లబ్ధిదారుల జాబితాను ఒకరోజు ముందే విడుల చేశారు అధికారులు. లబ్ధిదారులతో గ్రామాల నుంచి రైతు వేదికల వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి రుణమాఫీ చేసిన విషయాన్ని ప్రకటిస్తారు. దీంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అంతా తొలగిపోయేలా ఏర్పాట్లు చేశారు.
డేరింగ్ స్టెప్..
ఇక రాజకీయంగా డేరింగ్ స్టెప్ వేయడంతో రేవంత్‌రెడ్డికి ప్రత్యేకత ఉంది. ఇంత కాలం నిధులే ఉండవని. .. రేవంత్ రుణమాఫీ విషయంలో వెనుకబడిపోతారని బీఆర్‌ఎస్ నేతలు అనుకున్నారు. కానీ 30 వేల కోట్లను సమీకరించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో విపక్షాలు లబ్ధిదారులను తగ్గించారని విమర్శలు ప్రారంభించాయి. కానీ రేవంత్‌రెడ్డి ఇప్పటికే సిక్సర్ కొట్టేశారు. దాని ముందు విపక్షాల విమర్శలు తేలిపోతున్నాయి.
డీఎస్సీ పరీక్షలు ప్రారంభం..
ఇదిలా ఉండగా డీఎస్సీ వాయిదా వేయాలని నిరసనలు తెలిపిన అభ్యర్థులు కామ్‌గా వెళ్లి పరీక్షలు రాసుకుంటున్నారు. గురువారం(జూలై 18) నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆందోళనలు సద్దుమణిగాయి. ఇక గ్రూప్–2, 3 విషయంలోనూ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రేవంత్‌రెడ్డి తన మాట నిలబెట్టుకుని తన మార్కు పాలన ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.