Maruti Suzuki Swift: మారుతి స్విప్ట్.. సేప్టీ రేటింగ్ లో దీని ర్యాంక్ ఎంతంటే? ఇది నమ్మగలరా? అసలు విషయమేంటంటే?

Euro NCAP టెస్ట్ ప్రకారం స్విప్ట్ కు 3 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అంటే 67 శాతం పెద్దలకు భద్రత ఉండనుంది. 65 శాతం చిల్ట్రన్స్ కు సేప్టీ ఇవ్వనుంది. సేప్టీ అసిస్ట్ లో కేవలం 62 శాతమే రేటింగ్ పొందిది. గతుకుల రోడ్డులో ప్రయాణించేటప్పుడు భద్రతా రేటింగ్ 76 శాతం స్కోర్ చేసింది. ఇది ఇండియాలో ఉన్న స్విప్ట్ కంటే ఎక్కువ భద్రత ఫీచర్లు ఉన్నప్పటికీ Euro NCAP రేటింగ్ లో మాత్రం వెనుకబడింది.

Written By: Chai Muchhata, Updated On : July 18, 2024 11:28 am

Maruti Suzuki Swift

Follow us on

Maruti Suzuki Swift: దేశంలో కార్ల మార్కెట్లో మారుతి కంపెనీ అగ్రగామిగా నిలుస్తోంది. భారత్ లో చాలా మంది వద్ద మారుతి కార్లు ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్ ఆల్టో కే 10 నుంచి 7 సీటర్ ఎర్టీగా వరకు వివిధ మోడళ్లతో వినియోగదారుల మనసు దోచుకుంది. మారుతి నుంచి రిలీజ్ అయిన కార్లలో వ్యాగన్ ఆర్, స్విప్ట్ లు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. వీటిలో స్విప్ట్ దశాబ్దాలుగా అమ్మకాలు జోరు కొనసాగిస్తోంది. అయితే స్విప్ట్ 4వ తరం ఇటీవలె విడుదలయింది. మార్కట్లోకి వచ్చిన కొద్ది కాలానికే అమ్మకాలు ఊపందుకున్నాయి. తాజాగా స్విప్ట్ క్రాస్ టెస్ట్ రేటింగ్ లో ఫెయిల్ అయింది. సేప్టీ విషయంలో దీనిని పరీక్షించగా భద్రత లేదని తేలింది. అయితే ఈ స్విప్ట్ ఇండియాది కాదు. ఆ వివరాల్లోకి వెళితే..

కారు కొనాలనుకునే వారు స్విప్ట్ గురించి తెలిస్తే విడిచిపెట్టరు. ఈ మోడల్ లో ఉన్న ఫీచర్లతో పాటు ఇంజిన్ కెపాసిటి, వివిధ కారణాల వల్ల స్విప్ట్ పై మనసు పడుతున్నారు. స్విప్ట్ కు ఉన్న ఆదరణను చూసి కంపెనీ ప్రతినిధులు దీని 4వ తరం మోడల్ ను గత మే 9న మార్కెట్లోకి రిలీజ్ చేశారు. కొత్త స్విప్ట్ ను సైతం వినియోగదారులు ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా స్విప్ట్ ను క్రాస్ టెస్టింగ్ చేశారు. ఈ టెస్టింగ్ లో ఇది 3 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది. ఇది భారత్ కు చెందిన స్విప్ట్ కాదని ఐరపా మార్కెట్లో విక్రయించే స్విప్ట్ అని కంపెనీ పేర్కొంది. దీనిని అక్కడి మార్కెట్లో విక్రయించడానికి Euro NCAP టెస్ట్ ను నిర్వహించారు.

Euro NCAP టెస్ట్ ప్రకారం స్విప్ట్ కు 3 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అంటే 67 శాతం పెద్దలకు భద్రత ఉండనుంది. 65 శాతం చిల్ట్రన్స్ కు సేప్టీ ఇవ్వనుంది. సేప్టీ అసిస్ట్ లో కేవలం 62 శాతమే రేటింగ్ పొందిది. గతుకుల రోడ్డులో ప్రయాణించేటప్పుడు భద్రతా రేటింగ్ 76 శాతం స్కోర్ చేసింది. ఇది ఇండియాలో ఉన్న స్విప్ట్ కంటే ఎక్కువ భద్రత ఫీచర్లు ఉన్నప్పటికీ Euro NCAP రేటింగ్ లో మాత్రం వెనుకబడింది. ఇందులో ప్రత్యేకంగా అటామనస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాస్, ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్ వంటి లేటేస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇండియాలో ఉన్న స్విప్ట్ లో ఇవి లేవు.

ఇండియాలో ఉన్న స్విప్ట్ లో 6 ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్, చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్, ఐసోపిక్స్, లోడ్ లిమిటర్, అడాస్, అడాస్ సూట్, ఫ్రంటల్ ఆప్ సెట్ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్లతో ఇక్కడి స్విప్ట్ రేటింగ్ లో స్థిరత్వాన్ని కొనసాగిస్తోంది. అయితే యూరప్ లో రేటింగ్ పొందిన స్విప్ట్ ను జపాన్ లో తయారు చేశారు. దీనికి ఇండియా స్విప్ట్ కు సంబంధం లేదు. అయితే రాబోయే కాలంలో ఇండియా స్విప్ట్ ఎలాంటి రేటింగ్ పొందుతుందోనని కారు వినియోగాదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఇండియాలో స్విప్ట్ జోరు కొనసాగుతోంది. ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ తో అందుబాటులో ఉంది. ఇది 82 బీహెచ్ పీ పవర్, 112 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.6.5 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.9.59 లక్షల వరకు విక్రయిస్తున్నారు.లో బడ్జెట్ లో కారు కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.