Swetcha Votarkar Passed Away: తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం న్యూస్ ప్రజెంటర్ గా మాత్రమే కాకుండా.. మహిళా జర్నలిస్టుగా ఆమె ఎన్నో అద్భుతమైన కథనాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఓ ప్రముఖ ఛానల్లో తన కెరియర్ మొదలుపెట్టిన ఆమె అంచలంచలుగా ఎదిగి ఇక్కడిదాకా చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె టియుడబ్ల్యుజే లో రాష్ట్రస్థాయి కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
Also Read: ఓపెనింగ్స్ లో ‘కుబేర’ కి దరిదాపుల్లో రాలేకపోయిన ‘కన్నప్ప’..ప్రభాస్ కూడా కాపాడలేకపోయాడుగా!
స్వేచ్ఛ ధైర్యం ఎక్కువగా ఉన్న మహిళా జర్నలిస్టు. ముక్కు సూటితత్వం ఆమె సొంతం. ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసే నైజం ఆమెది. అదే ఆమెను జర్నలిస్టు లోకంలో ప్రత్యేకంగా నిలిపింది. ఓ ప్రముఖ ఛానల్లో ఆమె తన కెరియర్ మొదలుపెట్టారు. ప్రారంభంలోనే తనకున్న దూకుడుతో అంచలంచలుగా ఎదిగారు. కీలక దశకు చేరుకుంటుందనగా ఆ చానల్లో పనిచేసే పెద్ద వ్యక్తి ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీంతో అందులో నుంచి ఆమె బయటికి వచ్చింది. ఆ తర్వాత ఇతర ఛానళ్లలో వివిధ స్థానాలలో పనిచేసింది. తన పని చేసిన ప్రతి ఛానల్ లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మానవీయ కథనాలను ప్రజెంట్ చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. స్వతంత్ర భావజాలం, సమస్యలకు ఎదురొడ్డి పోరాడే నైజం స్వేచ్ఛది. నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళా జర్నలిస్టుగా ఆమె ముందు వరుసలో ఉండి పోరాడారు. ఎంతోమందికి ధైర్యం చెప్పారు. అయితే అటువంటి స్వేచ్ఛ ఉన్నట్టుండి చనిపోడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నదా? లేక ఎవరైనా దారుణానికి పాల్పడి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
కూతురితో కలిసి జీవనం
స్వేచ్ఛకు ఒక కూతురు ఉంది. ఆమె పాఠశాలకు వెళ్తున్నది. చిక్కడపల్లిలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తులో స్వేచ్ఛ తన కూతురుతో కలిసి ఉంటున్నది.. అయితే దీనిని ఆత్మహత్య అని చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం అనుమానాస్పద మరణంగా పేర్కొంటూ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. స్వేచ్ఛ తను నివాసం ఉంటున్న ప్లాట్ లో ఉరి వేసుకుందని.. లుంగీని మెడకు బిగించుకొని ఈ ధర్నానికి పాల్పడిందని స్థానికులు అంటున్నారు. పోలీసులు దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక స్వేచ్ఛ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె సరిగా ఐదు సంవత్సరాల క్రితం తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె తన స్నేహితుడితో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. మొదటి భర్త ద్వారా కలిగిన కుమార్తెను పెంచుకుంటూ.. తన స్నేహితుడితో కలిసి స్వేచ్ఛ ఉంటున్నట్టు తెలుస్తోంది. స్నేహితుడుతో ఏవైనా సమస్యలు వచ్చాయా? అందువల్లే ఆమె మరణించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో..
స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్ ప్రాంతంలో ఉంటున్నారు. వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.. మరోవైపు ఈ సంఘటన తెలుగు మీడియా రంగంలో దిగ్బ్రాంతి కరంగా మారింది. స్వేచ్ఛ న్యూస్ ప్రజెంటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె మరణం వెనుక ఎటువంటి కారణాలు ఉన్నాయనేది త్వరలో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆమెతో ఉంటున్న ఆ స్నేహితుడు ఎవరు? అతని వల్ల ఆమెకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆమె కన్ను మూయడానికి ముందు ఏదైనా జరిగిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు లభిస్తాయో చూడాల్సి ఉంది.