Today 28 June Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శని పుష్య యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణ ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారి జీవనశైలిలో కొన్ని మార్పులు వస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఆర్తి విషయంలో శుభవార్తలు వింటారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈరోజు వారికి ఈరోజు స్వల్పంగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. దీంతో మానసికంగా ఆందోళనతో ఉంటారు. ప్రియమైన వారితో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రావడంతో ప్రశాంతత నెలకొంటుంది. విద్యార్థులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే కొందరు నైపుణ్యాలు ప్రదర్శించడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి విషయం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలాగ నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు చేయదు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి ప్రయాణాలు చేసేటప్పుడు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇంటి నిర్మాణానికి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడతాయి. అయితే సామరస్య వాతావరణంతో వాతావరణం చల్లబడుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగం నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : అనుకోకుండా దూర ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆస్తుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ప్రయాణాలు చేసే సమయంలో సంయమనం పాటించాలి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వివరాలు జరపొద్దు. పెట్టుబడును పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు శక్తికి మించి పని చేయడం వల్ల అలసిపోతారు. కమ్యూనికేషన్ లోపం ఏర్పడడం వల్ల కొన్ని సంబంధాలలో చీలికలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనుల్లో ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సమస్యలు తగ్గిపోతాయి. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఉద్యోగులు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. దీంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ఏవైనా పత్రాలపై సంతకం పెట్టేటప్పుడు ఆలోచించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : బడ్జెట్ కు అనుగుణంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. కొన్ని పనులు పూర్తికావడంతో ప్రశాంతంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : దీర్ఘకాలిక అవసరాల కోసం కొత్తగా పెట్టుబడును పెడతారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థుల కోటి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. రోజువారీ ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. అయితే తోటి వారి సహాయం ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో సమయమును పాటించాలి. తల్లిదండ్రులతో భేదాభిప్రాయాలు లేకుండా చూడాలి. ఆస్తుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.