Kannappa vs Kubera అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘కుబేర'(Kuberaa Movie) విడుదలై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. డెఫిసిట్స్ తో నడుస్తున్న థియేటర్స్ కి ఈ చిత్రం ద్వారా కొత్త కల వచ్చింది. చాలా కాలం తర్వాత థియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. టాలీవుడ్ కి మళ్ళీ మంచి రోజులు మొదలయ్యే సూచనలు ఈ చిత్రం ద్వారా కనిపించాయి. ఇది ఇలా ఉండగా నేడు మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) భారీ అంచనాల నడుమ విడుదలైంది. అసలే దైవ భక్తి మీద భారీ బడ్జెట్ సినిమా, పైగా రెబెల్ స్టార్ ప్రభాస్,అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి లెజెండ్స్ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండడం తో అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా జరిగాయి.
మంచు విష్ణు(Manchu Vishnu) కి ఈ రేంజ్ బుకింగ్స్ భవిష్యత్తులో జరుగుతాయో లేదో తెలియదు కానీ , ఈ సినిమాకు ఈ స్థాయి బుకింగ్స్ జరగడానికి కారణం ప్రభాస్(Rebel Star Prabhas) స్టార్ పవర్ అని అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ మాత్రం సరిపోతుందా అంటే అనుమానమే. సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని మంచు విష్ణు లాభాల్లోకి రావాలంటే కచ్చితంగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అంత షేర్ వసూళ్లు రావాలంటే మొదటి రోజు కనీసం 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. కానీ ఈ చిత్రం ‘కుబేర’ ఓపెనింగ్స్ ని కూడా అందుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. కుబేర చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 6 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
‘కన్నప్ప’ చిత్రానికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రావడం కష్టమే అనిపిస్తుంది. ఆరు కోట్ల రూపాయిల షేర్ అంటే మంచు విష్ణు రేంజ్ కి చాలా పెద్దది. కానీ సినిమా స్కేల్ కి ఏ మాత్రం సరిపోదు. ఇక ఓవర్సీస్ లో అయితే కుబేర కి ఒక్క ప్రాంతంలో కూడా దరిదాపుల్లోకి రాలేకపోయింది ఈ చిత్రం. ఓవరాల్ గా మొదటి రోజు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా ప్రభాస్ కారణంగానే వచ్చాయి, లేకుంటే 10 కోట్ల లోపే గ్రాస్ వసూళ్లు ఉండేవని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దైవ భక్తి ఉన్న సినిమా కాబట్టి భీభత్సమైన లాంగ్ రన్ ని కనబరిస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకోవచ్చు. మరి ఈకాలం లో భారీ లాంగ్ రన్ దొరకడం సాధ్యమా కాదా అనేది చూడాలి.