Notice Issue: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది తర్వాత పరిణామాలతో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ నేతలు పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్‌కు ముందుగా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు.. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో కేటీఆర్‌తోపాటు పలువురు సుప్రీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ సెక్రెటరీని ఆదేశించింది. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. అనర్హతపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు.. ఎంతకాలం పడుతుందని ప్రశ్నించింది.
పది మందికి నోటీసులు..
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రెటరీ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసుల్లో ఎప్పట ఇవరకు వివరణ ఇవ్వాలో పేర్కొనలేదని సమాచారం. మరోవైపు నోటీసులు అందుకున్న పది మంది ఎమ్మెల్యేలు తమకు గడువు కావాలని కోరినట్లు సమాచారం.
ఫిబ్రవరి 10న విచారణ..
ఇదిలా ఉండగా సుప్రీ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు జారీ అయిన వారిలో దానం నాగేందర్, తెల్లాం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉన్నారు.