Samantha: పాన్ ఇండియా లెవెల్లో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు సమంత. కేవలం పదేళ్లలోనే ఆమె ఎవరికీ అందంతంతా ఎత్తుకి ఎదిగింది. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత రూటు మార్చి కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ముందుకెళ్తున్న ఆమె, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ సృష్టించి ఓవర్ నైట్ పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటి వరకు కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చిన సమంత ఈ వెబ్ సిరీస్ లో విలన్ గా నటించి అందరినీ షాక్ కి గురయ్యేలా చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ తర్వాతనే సమంత కి కష్టాలు మొదలయ్యాయి. నాగ చైతన్య తో విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత మయోసిటిస్ రోగం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరం గా ఉండడం వంటివి జరిగింది.
విడాకుల తర్వాత ఆమె నుండి ‘కాతువాకుల రెండు కాథల్’ అనే తమిళ సినిమాతో పాటు, యశోద, శాకుంతలం మరియు ఖుషి వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్ గానే ఆమె నటించిన ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయ్యి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సమంత, కాసేపటి క్రితమే అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు సంచలనంగా మారాయి. అబ్బాయి గెటప్ లో స్టైల్ గా నిల్చొని ఆమె దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి. హెయిర్ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉండేలా అనిపిస్తుంది. ఎందుకు ఈమె ఇలా తయారైంది. ఆమె కొత్త సినిమాలో లుక్ ఇలా ఉండబోతుందా అని సోషల్ మీడియా లో ఆమె అభిమానులు ఆరా తీశారు.
అలా ఆరా తీయగా ఇది సినిమా కోసం కాదని, కేవలం ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం తీసుకున్న ఫోటో షూట్ అని తెలిసింది. కేవలం ఫోటోషూట్ కోసం ఇంత మేక్ ఓవర్ అవసరమా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే కొంతకాలం తాత్కాలిక విరామం ఇచ్చిన తర్వాత సమంత మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతుంది. రీసెంట్ గానే ఈమె ‘ట్రా..లా..లా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థలో కేవలం తన సినిమాలను మాత్రమే కాకుండా టాలెంట్ ఉన్న కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ సినిమాలను నిర్మించనుంది సమంత. తెలుగు తో పాటు హిందీ లో కూడా రెండు సినిమాలు రీసెంట్ గానే ఆమె సంతకం చేసిందట, త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ మొదలు కానున్నాయి.