HomeతెలంగాణSLBC Tunnel : ఎవరీ ర్యాట్ హోల్ మైనర్స్ .. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రంగంలోకి...

SLBC Tunnel : ఎవరీ ర్యాట్ హోల్ మైనర్స్ .. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రంగంలోకి దించింది? SLBC లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో తీసుకొస్తారా?

SLBC Tunnel  : సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు గత శనివారం అర్ధరాత్రి ఘటన స్థలానికి రక్షణ బృందాలు చేరుకున్నాయి. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి ప్రయత్నాలను వేగవంతం చేశాయి.. మొత్తం సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఆర్మీ బృందం.. 130 మంది ఎన్డిఆర్ఎఫ్.. 24 మంది హైడ్రా బృందం.. 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్.. 120 మంది కూడిన ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. అయితే మట్టి, నీరు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది.. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలడంతో ఈ ఘటన జరిగింది. అయితే ఇప్పటివరకు 13.5 కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్లాయి. అయితే ఇంకో అర కిలోమీటర్ వెళ్లడానికి నీరు, మట్టి అడ్డంకులు కల్పిస్తున్నాయి. ఈ అడ్డంకులను అధిగమించడానికి సహాయక బృందాలు చేయని ప్రయత్నం అంటూ లేదు. నీరు, మట్టి, బురదను తోడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.. అయితే 200 మీటర్ల గ్యాప్ లోనే 8 మంది ఉన్నారని తెలుస్తోంది. పనులు జరుగుతున్న సమయంలో నీరు ఉదృతంగా రావడం వల్ల టన్నెల్ బోరింగ్ మిషన్ ఇప్పటికే 80 మీటర్లు వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది. టన్నెల్ మిషన్ రావడం వల్ల దాదాపు 200 మీటర్లలో గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ లోనే 80 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. అందులో చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు పిలుస్తున్నాయి. అయినప్పటికీ వారి నుంచి ప్రతిస్పందన లేదు. మరోవైపు రెస్క్యూ బృందాలకు టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం కనిపించినట్టు తెలుస్తోంది. అయితే సొరంగం పైకప్పు కూడడం వల్ల టన్నెల్ బోరింగ్ మిషన్ మట్టిలో పూడుకు పోయింది. అయితే చిక్కుకున్న 8 మందిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు టీబీఎం ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. సహాయక చర్యలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పి వైభవ్ గైక్వాడ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్ (Rat holes Miners) ను రంగంలోకి దించింది.. వారు ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ బృందంలో ఆరుగురు మైనర్లు ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వారు సొరంగం వద్దకు చేరుకున్నారు. 2023లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల వరకు ప్రయత్నించినప్పటికీ వారిని అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగి.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. యంత్రాల సహాయంతో అనుబంధ సొరంగాలు తవ్వారు. ఆ తర్వాత వారిని ఒక రోజులోనే బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎస్ ఎల్ బీ సీ సొరంగంలో చిక్కుపోయిన వారిని కూడా ర్యాట్ హోల్ మైనర్స్ అదేవిధంగా బయటికి తీసుకొస్తారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇతర సహాయక బృందాలతో కలిసి ర్యాట్ హోల్ మైనర్స్ రెస్క్యూ ఆపరేషన్ చేపడతారని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular