https://oktelugu.com/

seventh nizam grand Daughter  : ఒకప్పుడు ప్రపంచంలోనే ధనవంతులు.. ఇప్పుడు ఠాణా మెట్లెక్కిన నిజాం మనుమరాలు.. అసలు ఏంటి వివాదం?

స్వాతంత్య్రానికి పూర్వం నుంచి హైదరాబాద్‌ సంస్థానాన్ని పాలించారు నిజాం ప్రభువులు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్ పాలనలో ఉన్న సమయంలో భారత్‌కు స్వాతంత్రం వచ్చింది. నిజాం పాలనకు గుర్తుగా తెలంగాణలో, హైదరాబాద్‌లో అనేక కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 8, 2024 / 11:48 AM IST

    Seventh nizam granddaughter 

    Follow us on

    Seventh nizam grand Daughter  : నిజాం అంటేనే తెలంగాణ. హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుని బ్రిటిష్‌ పాలకులకు సామంతులుగా ఉంటూ.. నిజాంలు తెలంగాణతోపాటు, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని సంస్థానాలను పాలించారు. తమ పాలనలో అనేక అభివృద్ధి పనలు చేశారు. చెరువులు తవ్వించారు. తాగునీటి సమస్య పరిష్కరించారు. రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. నిజాంలు నిర్మించిన అనేక కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. సుమారు 400 ఏళ్లు నిజాంలు తెలంగాణను పాలించినట్లు చరిత్ర చెబుతోంది. చార్మినార్‌ నిజాంలు నిర్మించినదే. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలన సమయంలో భారత దేశానికి బ్రిటిష్‌ పాలకులు స్వాతంత్య్రం ఇచ్చారు. అయితే నిజాం మాత్రం భారత్‌లో విలీనానికి అంగీకరించలేదు. దీంతో 1948లో హోం మంత్రి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ సైనిక చర్యతో ఏడో నిజాం దిగివచ్చారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు అంగీకరించారు. ఇదిలా ఉంటే నిజాం సంపదకు కొదువలేదు. వందల ఏళ్లు పాలించిన నిజాంలు భారీగా భూములు, వజ్రవైడూర్యాలు, ఆభరనాలు సంపాదించారు. ఇప్పటికీ నిజాంల పేరిట దేవంలో ఆస్తులు ఉన్నాయి. చాలా వరక అన్యాక్రాంతం అయ్యాయి. ఇప్పటికీ కొందరు తప్పుడు పత్రాలతో కాజేసే ప్రయత్నంలో ఉన్నారు.

    పోలీస్‌ స్టేషన్‌కు నిజాం మనుమరాలు..
    తాజాగా ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మనుమరాలు ప్రిన్సెస్‌ ఫౌజియా పోలీసులను ఆశ్రయించారు. తన తాత ఆస్తులను కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, నకిలీ పత్రాలు సృష్టించారని ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని రూ.121 కోట్ల విలువైన ఆస్తులు కాజేసే ప్లాన్‌ చేశారని పేర్కొన్నారు. వారిపై చర్య తీసుకోవాలని కోరారు.

    నిజాం వారసులమంటూ..
    ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రెండో కుమారుడు హైనస్‌ వాల్షన్‌ ప్రిన్స్‌ మౌజ్జమ్‌ ఝూ బహదూర్‌ కుమార్తె ఫాతిమా. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాము ఏడో నిజాం వారసులమని 2016లో తెరపైకి వచ్చారు. తమ పేరిన నిజాం జరరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేశారంటూ 150 మంది సాక్షలుతో కోర్టుద్వారా వారసత్వ పత్రం పొందారు. అయితే అవన్నీ నకిలీవని, ఫోర్జరీ సంతయాలతో సృష్టించారని తాజాగా ఫాతిమా పోలీసులను ఆశ్రయించారు. ఆ పత్రాలతో నిజాం ఆస్తులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నిజాం వారసుల పేరుతో ప్రభుత్వం నుంచి పరిహారం కూడా పొందుతున్నట్లు తెలిపారు.

    నిజాంకు ఒక్కరే భార్య..
    ముసిల పర్సనల్‌ చట్టం ప్రకారం ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు దుల్హాన్‌ పాషా ఒక్కరే భార్య అని తెలిపారు. ఆయన భార్యలుగా చెప్పుకుంటున్నవారికి చట్ట ప్రకారం అర్హత లేదని తెలిపారు. కొందరు నకిలీ పత్రాలతో కోర్టును మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    తమిళనాడు ఆస్తులపై కన్ను..
    నిజాంకు తమిళనాడులో రూ.121 కోట్ల విలువైన ఎస్టేంట్‌ ఉంది. దానిని కాజేసేందుకు నిందితులు తాము నిజాం వారసులుగా చెప్పుకుంటున్నారని ఫాతిమా ఫిర్యాదులో తెలిపారు. వారిపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపనోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో తాజాగా సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన నిజాం వారసులు ఎవరో తేలే వరకు వారికి ఇచ్చిన వారసత్వాన్ని రద్దు చేయాలని ఫాతిమా కోరుతున్నారు.

    ప్రపంచ కుబేరుడిగా..
    ఏడో నిజాం అప్పట్లో ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. లెక్కకు మించి విలువైన ఆస్తులు, భూములు, ఆభరణాలు, వజ్రాలతో ప్రపంచంలోనే ధనవంతుడిగా వెలుగొందారు. ఆ తర్వాత 1971లో ప్రభుత్వం తీసుకన్న రాజభరణాల రద్దు నిర్ణయంతో నిజాం ఆస్తులు స్వాధీనం అయ్యాయి. మరికొన్ని ఆస్తులు నిజాం వారసుల పేరుతో ఉన్నాయి. వారిపై వివాదం నడుస్తోంది. గతేడాది ఎనిమిదో నిజాం రాజు ముకర్రమ్‌ ఝూ బహదూర్‌ టర్కీలో తుదిశ్వాస విడిచారు. చిన్నతనంలో ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఆయన విలాసాలకు, ఆర్భాటాలకు అలవాటుపడి దివాలా తీశారు. చివరకు టర్కీలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని అక్కడే కన్నుమూశాడు. హైదరాబాద్‌లో అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు.