Parents should teach their children: తల్లిదండ్రులను చూసే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. పిల్లలను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ప్రతి విషయం గురించి చెప్పాలి. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం చాలా ముఖ్యమైనది. చిన్నప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారో అవే అలవాట్లు ఉండిపోతాయి. చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రులను ఒక రూల్ మోడల్‌గా చూస్తారు. ఆ సమయంలో పిల్లల కోసమైన తల్లిదండ్రులు మంచిగా ఉండాలి. ఎందుకంటే చిన్నతనంలో పిల్లలకు మంచి ఏది, చెడు ఏది తెలియదు. పెద్దవారు ఏం చేస్తే అదే మంచి, చెడు అని అనుకుంటారు. కాబట్టి పిల్లలకు చిన్నతనంలో మంచి విషయాలను మాత్రమే తల్లిదండ్రులు నేర్పించాలి. కొందరు తల్లిదండ్రులు ఇంట్లో సరిగ్గా ఉండలేక, గొడవలు పడుతూనే ఉంటారు. కనీసం గౌరవం లేకుండా కొట్టుకుంటారు. ఇలాంటివి అన్ని పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. వారు కూడా భవిష్యత్తులో అలా చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని విషయాలను నేర్పించాలి. అవి వాళ్లకి జీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాధ్యతలు నేర్పించాలి
తల్లిదండ్రులు పిల్లలను కష్టపెట్టకుండా పెంచుతారు. కానీ ఇది కరెక్ట్ కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పిల్లలను ఎంత ముద్దుగా చూసుకున్న కూడా వాళ్లకి బాధ్యతలు నేర్పించాలి. అప్పుడే వాళ్లు జీవితంలో ఉన్నతంగా ఉండగలరు. తండ్రి ఎంత బాధ్యతగా ఉంటే పిల్లలు కూడా అలా ఉంటారు. కాబట్టి ఏ పని చేసిన బాధ్యతగా ఉండేలా పిల్లలకు నేర్పించండి.
కష్టం మీద ఆధారపడటం
ఎవరి మీద ఆధారపడకుండా కష్టం మీద జీవించమని పిల్లలకు నేర్పించండి. అడ్డదారిలో సంపాదించవద్దని, అలా వచ్చింది ఉండదని పిల్లలను తల్లిదండ్రులు చెప్పాలి. జీవితంలో ఎంత కష్టపడితే అంత పైకి వస్తారని చెప్పాలి. ఇతరుల నుంచి రూపాయి ఆశించకుండా సొంత కష్టం మీద బతికేలా నేర్పించండి. తల్లిదండ్రులు కూడా కష్టం మీద బతుకుతుండాలి. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను చూసి నేర్చుకుంటారు.
సొంత నిర్ణయాలు తీసుకోవాలి
ఇతరుల ఇష్టాలు, వారి మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్పించాలి. ఏదైనా సమస్య వస్తే ప్రతీసారి కాపాడటానికి ఎవరూ రారని, మంచి జరిగిన, చెడు జరిగిన సొంత నిర్ణయాలే తీసుకోవాలని చెప్పాలి. అలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో కొన్ని విషయాలు తెలుస్తాయి.
డబ్బుల విలువ తెలిసేలా చేయాలి
చాలా తల్లిదండ్రులు పిల్లలను గారాబంగా చూసుకునే క్రమంలో వారికి డబ్బులు విరివిగా ఇస్తారు. పిల్లలకు డబ్బులు ఇవ్వాలి. కానీ దాని విలువ తెలిసేలా ఇవ్వాలి. చాలామంది వాళ్ల పిల్లలకు డబ్బులు విలువ తెలియక పెంచడం వల్ల విపరీతంగా డబ్బు వృథాగా ఖర్చు చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు పెద్దయ్యాక కూడా ఉంటే ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి పిల్లలకు ఆర్థిక విషయాల్లో ఎలా ఉండాలో నేర్పించండి.
మాట్లాడే విధానం..
పెద్దవాళ్లతో ఎలా ఉండాలి, చిన్న పిల్లలతో ఎలా ఉండాలని చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలను తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు తెలిసేలా, అందరిని కలుపుకుంటూ, గౌరవించి మాట్లాడేలా నేర్పించండి.