Raja Singh Commets : బీజేపీ అంటే క్రమశిక్షణగల పార్టీ అంటారు. అందరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారు అన్న గుర్తింపు ఉంది. కానీ తెలంగాణ బీజేపీలో కొత్త నేతల చేరిక, పాత నేతలు, కొత్త నేతల మధ్య పొలసకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడినే తప్పించారు. ఇక తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంతో మరోమారు ముసలం పుట్టింది. సీనియర్ నేత, గోషామహల్(Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులకు గురిచేస్తున్నారని ఇక తట్టుకోవడం తన వల్ల కాదని పేర్కొన్నారు. పార్టీకి అవసరం లేదు అనుకుంటే బయటకు వెళ్లిపోవడానికి కూడా సిద్ధమనిబాంబు పేల్చారు. జిలాల్ల అధ్యక్షుడి నియామకంలో తన సూచనలను పట్టించుకోకుండా ఎంఐఎంతో తిరిగే నేతకు గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని తప్పు పట్టారు. దళిత లేదా బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వాలని తాను సూచించినట్లు వెల్లడించారు.
పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులే..
తాను 2014లో బీజేపీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని వెల్లడించారు. పార్టీకి అవసరం లేకపోతే వెళ్లిపోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. గతంలో కూడా ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్(Suspend) చేశారు. 2023 ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తేసి మరోమారు గోషామహల్ టికెట్ ఇచ్చారు. అయితే రాజాసింగ్ గోషామహల్ టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఆశించారు. కానీ, ఇవ్వలేదు. తర్వాత హైదరాబాద్(Hyderabad) ఎంపీ టికెట్ మహిళకు ఇవ్వడాన్ని కూడా తప్పు పట్టారు. మొగవాళ్లు లేరా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీలో వేధింపులు పెరిగాయని, భరించలేనని పేర్కొన్నారు.
మూడు పార్టీలతో పోరాటం..
ఇక బీజేపీ తరఫున తాను బీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పారీటలతో పోటీ చేస్తున్నానని తెలిపారు. సొంత పార్టీలోనూ ఇప్పుడ యుద్ధం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష పదవి ఎమ్మెల్యే ఎ ంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందన్నారు. కానీ, గోల్కొండ జిల్లా అధ్యక్షుడి ఎంపిక మాత్రం తన సూచనను పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేశారు. జీవితంలో నేను ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నానని, ప్రస్తుం పార్టీలో కొందరిలా బ్రోకరిజం చేయడం లేదని తెలిపారు. వారికారణంగానే పార్టీ వెనుకబడిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉందని తెలిపారు. కానీ రిటైర్ అయిన వ్యక్తులు ఉంటే బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.