Viswaksen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తనకు ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇప్పటి యువతకు యూత్ ఐకాన్ లా కనిపించే విశ్వక్ నిజ జీవితంలో కూడా కాస్త అగ్రెసివ్ గా ఉంటాడు. తన సినిమాలను అతను ప్రమోట్ చేసుకునే తీరు అందరిని ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఏదో ఒక కామెంట్ చేయడం ద్వారా అందరి చూపూ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు.
హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలతో దుమ్ము లేపిన తర్వాత విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన మెకానిక్ రాకీ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాజాగా లైలా(Laila Movie)మూవీతో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. తన కెరీర్లో తొలి సారి విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. లైలా మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా థియేటర్లలోకి వచ్చింది.
ఇక పోతే విశ్వక్ చేసిన కామెంట్స్, చర్యలు వివాదాస్పదం అవుతుంటాయి. అవి పబ్లిసిటీకి ఉపయోగపడుతుంటాయి కూడా. ఐతే విశ్వక్ సేన్ కావాలనే ఇలా రామ్ గోపాల్ వర్మలా కాంట్రవర్శీలు క్రియేట్ చేస్తాడనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సహా కొన్ని చిత్రాల విడుదలకు ముందు రాజుకున్న వివాదాల కారణంగా ఆయన నటించిన చిత్రాలకు మంచి పబ్లిసిటీ వచ్చిందని చెప్పొచ్చు. జనాల అభిప్రాయం కూడా ఇదే.
తాజాగా ‘లైలా’ సినిమా రిలీజ్ కు ముందు ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో 30ఇయర్స్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.. దీని మీద సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో.. బాయ్‌కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీనిపై టీం ప్రెస్ మీట్ పెట్టడం.. ఇదంతా తెలిసిన విషయమే. అంతే కాకుండా సినిమా విడుదల అయిన ఈ రోజు కూడా డిజాస్టర్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. మీ ప్రతి సినిమా ముంగిట ఈ వివాదాలేంటి, పబ్లిసిటీ కోసం ఇలాంటివి మీరే చేస్తున్నారా అని విశ్వక్‌ను అడిగితే.. ‘‘కాంట్రవర్శీలను ఎవరూ కోరి తెచ్చుకోరు. నాకైతే ఇవి వద్దనే అనిపిస్తుంది. నా చివరి మూడు సినిమాల విషయంలో వివాదాలేమీ లేవు. ‘లైలా’ ఈవెంట్లో నటుడు పృథ్వీ మాట్లాడిన మాటల మీద వివాదం చెలరేగింది. నేను మూడు నెలలకో సినిమా చేస్తున్నా. ఏదో ఒక సినిమా విషయంలో ఏదైనా జరిగినా సరే ప్రతిసారీ కాంట్రవర్శీ వస్తున్నట్లు అనిపిస్తుందన్నారు.
రోడ్డు మీద నిత్యం తిరుగుతుంటేనే కదా ప్రమాదాలు జరుగుతాయి. అలాగే నేను ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఇలా జరుగుతోందేమో. సినిమా వేడుకల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలని నిబంధన వస్తే నాకు కూడా సంతోషమే. అది పెద్దవాళ్లు తీసుకోవాల్సిన నిర్ణయం’’ అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.