Swa Rail App: ప్రస్తుత కాలంలో ప్రతి రంగం టెక్నాలజీతో అనేక మార్పులు చేసుకుంటుంది. సాంకేతికత కారణంగా కొన్ని పనులు ఈజీగా ఉండడంతో ఆయా రంగాలకు చెందినవారు వీటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వినియోగదారులు సైతం టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడుతుండడంతో కొన్ని సంస్థలు ప్రత్యేకంగా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి. భారతదేశంలోని ప్రయాణ మార్గాల్లో రైలు రవాణా అతి పెద్దది. ప్రతిరోజు రైళ్లలో వేలమంది ప్రయాణిస్తూ ఉంటారు. రైలులో ప్రయాణం చేసే సమయంలో రైలు గురించి, టికెట్ గురించి లేదా స్టేషన్లో ఉన్న సమస్యలపై ఫిర్యాదు చేయాలని చాలామంది అనుకుంటారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఆయా సమస్యలకు ప్రత్యేకంగా అప్లికేషన్లు అందుబాటులో ఉండేవి. కానీ కొత్తగా రైల్వే వ్యవస్థ Aaap ను తీసుకువస్తుంది. ఇందులో అన్ని సమస్యల పరిష్కారం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తూ ప్రయాణికులకు అందించబోతున్నారు. ఇంతకీ ఆ యాప్ ఏదంటే?
ట్రైన్ జర్నీ చేసేవారు రిజర్వేషన్ సీటు కావాలనుకుంటే ముందుగా IRTC ద్వారా టికెట్ బుక్ చేసుకునేవారు. టికెట్ బుకింగ్ కోసం ఈ యాప్ అందరికీ అందుబాటులో ఉండేది. అలాగే ప్లాట్ ఫారం టికెట్ లేదా ఇతర టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే UTC యాప్ ఉండేది. ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే WHER IS MY TRAIN అరే యాప్ ను డౌన్లోడ్ చేసుకునేవారు. దీని ద్వారా మనం కావాలనుకునే రైలు ఎక్కడుందో తెలిసిపోతుంది. ఇక ట్రైన్ లో లేదా ఫ్లాట్ ఫారం పై ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఫిర్యాదు చేయడానికి Railway Madad యాప్ ను డౌన్లోడ్ చేసుకునేవారు. ట్రైన్ జర్నీ చేసే సమయంలో ఏదైనా ఫుడ్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకునేవారు. ఇలా దేనికి అదే ప్రత్యేక యాప్ను కలిగి ఉండేది.
అయితే ఇప్పుడు రైల్వే వ్యవస్థ అన్ని సమస్యలు లేదా సదుపాయాలు కల్పించేందుకు ఉంటే యాప్లు అన్ని ఒకే వేదికగా ఉండేందుకు కొత్త యాప్ లో అందుబాటులోకి తీసుకొస్తుంది. అదే swarail app. ఈ యాప్ లో పైన పేర్కొనబడిన అన్ని యాప్ లో ఉంటాయి. ఇందులో టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం నుంచి ట్రైన్ లో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి రైల్వే మద్దతు యాప్ కూడా ఉంటుంది. అయితే ప్రతి సమస్యకు ప్రతి యాప్ ఉండడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో రైల్వే వారు వీటన్నింటినీ ఒకే వేదికపై ఉంచాలని swarail app అనే యాప్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
టైన్ జర్నీ చేసే వారికి ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ఇందులో ఉండే Railway Madad యాప్ తో పరిష్కరించుకోవచ్చు. వీటితోపాటు ట్రైన్ జర్నీ చేసేవారు కొన్ని నిబంధనలు తెలుసుకొని ఉండాలి. ట్రైన్ పై అవగాహన ఉండడం చాలా అవసరం. ఎందుకంటే సుదూరం వెళ్లడానికి ట్రైన్ మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా తక్కువ ప్రైస్ లోనే ఎక్కువ దూరం ప్రయాణించడానికి రైలు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
.